Advertisement

Advertisement


Home > Politics - Gossip

బాబును నమ్మి రాహుల్ మునుగుతాడా?

బాబును నమ్మి రాహుల్ మునుగుతాడా?

చంద్రబాబునాయుడు... తాను గతంలో పలుమార్లు కేంద్రంలో చక్రం తిప్పానని, వాజపేయి సహా తానే పలువురిని ప్రధానమంత్రుల్ని చేశానని చెప్పుకుంటూ ఉంటారు గనుక... తనను కూడా పీఎం చేసేయగలడని రాహుల్ ఆయనను నమ్మారు! అయితే అలా నమ్మినందుకు ఇప్పుడు రాహుల్ స్వయంగా నట్టేటమునిగే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబును నమ్మినందుకు రాహుల్.. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును కూడా పణంగా పెట్టారు.

గతంలో 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో.. కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినప్పటికీ... 2019 ఎన్నికల నాటికి.. తిరిగి జవసత్వాలు పుంజుకోవడానికి కృషిచేసి ఉండాల్సింది. అయితే.. చంద్రబాబుతో అప్రకటిత పొత్తు పర్యవసానంగా. ఏపీలో కాంగ్రెస్ పార్టీ గురించి రాహుల్ నామమాత్రంగా కూడా దృష్టి పెట్టలేదు. పైగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉండడానికి తగినట్లుగా అభ్యర్థుల్ని మోహరించారనే అపప్రధ కూడా ఉంది.

ఇన్ని చేసినప్పటికీ.. ఇప్పుడు రాహుల్ ను ప్రధాని చేయడానికి చంద్రబాబు పెద్దగా పూనుకోకపోవచ్చుననే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పెద్దసంఖ్యలో ఎంపీసీట్లు లభించే దానిని బట్టి.. చంద్రబాబు జైకొడుతున్న కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏర్పడినా... మమతా బెనర్జీ అధికారం కోరుకునే అవకాశం కూడా పుష్కలంగా ఉంది.

పైగా తాజాగా కేబినెట్ సహచరులతో చంద్రబాబు మాటలను గమనిస్తే.. భాజపాకు మెజారిటీ దక్కి... అధికారానికి కాస్త దూరంలో ఆగిపోయేట్లయితే గనుక... మోడీ కాకుండా మరెవ్వరు ప్రధాని అయినా సరే...  చంద్రబాబు తనంత తానుగా పూనుకుని మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.

ఎన్డీయేకు మెజారిటీ దక్కితే రాజ్ నాధ్, గడ్కరీ వంటి వారు ప్రధాని అయ్యే అవకాశం ఉందని చంద్రబాబు స్వయగా అనడం విశేషం. పైగా గడ్కరీకి అనుకూలంగా మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ పరిణామాలు చూస్తోంటే... బాబును నమ్మినందుకు రాహుల్ పరిస్థితి ఏమైపోతుందోనని అనిపిస్తోంది.

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?