Advertisement

Advertisement


Home > Politics - Gossip

మహాగో(నా)డు 3 : మతలబు ఏంటంటేనంట?

మహాగో(నా)డు 3 : మతలబు ఏంటంటేనంట?

చంద్రబాబునాయుడు ఈ ఏడాది మహానాడు నిర్వహించేది లేదని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి వాయిదా అని మాత్రమే ప్రకటిస్తున్నారు. నెమ్మదిగా.. మహానాడు గురించి కార్యకర్తలంతా మరచిపోయేంతవరకు సాగదీస్తారు. ఆ రకంగా నిర్వహించబోరు. అయితే ఎందుకిలా నిర్ణయం తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటినుంచి కేవలం మూడే పర్యాయాలు మహానాడు నిర్వహించకుండా ఉన్నారు. మరి మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన ఎందుకు నిర్వహించడం లేదు? ఈ నిర్ణయం వెనుక చాలా పుకార్లే వినిపిస్తున్నాయి. వాటిలో ఇదొక ప్రధాన కారణంగా పలువురు చర్చించుకుంటున్నారు.

సాధారణంగా మహానాడును మూడురోజులపాటు చాలా వైభవంగా నిర్వహిస్తారు. సభావేదిక దగ్గరినుంచి, షడ్రసోపేతమైన భోజనాల వరకు అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. ఇందుకు ప్రతి ఏటా కొన్ని కోట్ల రూపాయల వ్యయం చేస్తారు. అయితే ఇందులో ఒక కీలకం ఉంది. మహానాడు వేదిక ఏర్పాట్లు నిర్వహణ వ్యవహారాలు చూసే ఈవెంట్ మేనేజి మెంట్ సంస్థకే... ప్రభుత్వం ఖర్చుతో నిర్వహించే ముఖ్యమంత్రి కార్యక్రమాల కాంట్రాక్టు కూడా అప్పగిస్తుంటారనే ప్రచారం ఉంది. ప్రభుత్వకార్యక్రమాల నిర్వహణకు అడ్డగోలుగా నిధులు ఇచ్చేయడం... పార్టీ కార్యక్రమాలకు కారుచౌకగా సేవలు పుచ్చుకోవడం ఒక రివాజుగా ప్రచారంలో ఉంది.

అయితే ఇప్పుడు మహానాడు నిర్వహణకు మొత్తం ఖర్చు పార్టీ పెట్టుకోవాల్సిందే. రాష్ట్రంలో ఫలితాల తర్వాత అధికార మార్పిడి ఉంటుందనే ఉద్దేశంతో... మహానాడు నిర్వహణకు కారుచౌక సేవలందించడానికి ఎవరూ సిద్ధంగా లేరని సమాచారం. మొత్తం ఖర్చు పార్టీ ఖజానా నుంచి పెట్టుకోవాల్సి వచ్చేసరికి... అసలు నిర్వహణకే వెనుకాడుతున్నట్లు సమాచారం. పైగా మహానాడు వంటి భారీ కార్యక్రమం నిర్వహణ అంటే.. పార్టీ నేతల్లో పలువురు వివిధ బాధ్యతలను మోయడానికి, ఆర్థికంగా భారం పంచుకోవడానికి ముందుకు వస్తారు.

ఇప్పుడు పార్టీ పరిస్థితి డోలాయమానంగా ఉన్న పరిస్థితిలో అలా ఆర్థికభారం మోసే నాయకులు కూడా ముందుకు రావడంలేదు. ఎన్నికలకే తలకుమించి ఖర్చులైపోయాయని నిర్మొగమాటంగా చెప్పేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో... మహానాడు వాయిదా వేసుకోవడానికే చంద్రబాబు నాయుడు నిశ్చయించుకున్నట్లుగా వినిపిస్తోంది.

మహాగో(నా)డు 1 : ఎంతగొప్ప ఆత్మవంచన?

మహాగో(నా)డు 2 : మాకు బ్యాండేస్తున్నారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?