Advertisement

Advertisement


Home > Politics - Gossip

రేవంత్‌తో షర్మిల భేటీ: రహస్య చర్చలివే!

రేవంత్‌తో షర్మిల భేటీ: రహస్య చర్చలివే!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ కాంగ్రెస్ పార్టీ సారథి వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లి.. రేవంత్ దంపతులను కలిశారు. పార్టీ సారథ్యం స్వీకరించిన తర్వాత మొదటిసారిగా రేవంత్ నివాసానికి వెళ్లిన షర్మిల మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగినట్టుగా ప్రకటించారు. అయితే వీరిమధ్య రాజకీయ చర్చలు కూడా జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమచారాన్ని బట్టి.. ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల గుప్పిస్తూ సభలు సమావేశాలతో విరుచుకు పడుతున్న షర్మిల.. పార్టీకి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసమే రేవంత్ రెడ్డితో భేటీ అయినట్టుగా తెలుస్తోంది.

షర్మిల సారథ్యం స్వీకరించిన తర్వాత.. ఏపీ కాంగ్రెస్ లో కాస్త కదలిక వచ్చింది. అప్పటిదాకా గతంలో సాకే శైలజానాధ్ సారధిగా ఉన్నా, మొన్నమొన్నటి దాకా గిడుగు రుద్రరాజు సారధిగా ఉన్నా పార్టీ కార్యక్రమాల గురించి.. ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లడం గురించి పట్టించుకున్నది చాలా చాలా తక్కువ. కాంగ్రెసు పార్టీనుంచి అడపాదడపా పత్రికా ప్రకటనలు వచ్చే వి తప్ప.. యాక్టివిటీ ఏం ఉండేది కాదు. కానీ షర్మిల వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఉత్తరాంధ్రలో ప్రారంభించి.. ఇటు రాయలసీమ వరకు విస్తృతంగా పర్యటిస్తూ ఆమె సభలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యటనలు చేస్తున్నారు. ఈ సభలకు కూడా జనసమీకరణ జరుగుతోంది. ఇవన్నీ కూడా బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలే అనే సంగతి అందరికీ తెలుసు.

అయితే.. షర్మిల ఏపీ కాంగ్రెస్ సారథ్యం స్వీకరించిన నాటి నుంచి ఆమె చంద్రబాబుకు మేలు చేయడం కోసమే మాట్లాడుతున్నట్టుగా ప్రతి వ్యవహారమూ అనుమానాస్పదంగానే సాగుతోంది. ఆమె సారథ్యానికి చంద్రబాబు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారనే గుసగుసలు కూడా రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. చంద్రబాబు తరఫున.. ఆయనను తిరిగి సీఎం చేయడానికి తపన పడుతున్న వాళ్లలో.. ఆయన అనుంగు శిష్యుడు రేవంత్ రెడ్డి, ఈ ఆర్థిక వ్యవహారాలకు సంధానకర్తగా ఉన్నట్టు గుసగుసలు ఉన్నాయి.

జగన్ మీద బురద చల్లడానికి ఏపీ కాంగ్రెస్ కు అవసరమయ్యే నిధులను తెలంగాణ కాంగ్రెస్ సమకూర్చేలా ఒప్పందం కుదిరిందని.. వారికి చంద్రబాబు అక్రమ నిధులు అందుతాయని ఒక ప్రచారం ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. పీసీసీ సారథ్యం స్వీకరించి.. ఒకవిడత ప్రజలను చుట్టబెట్టేసిన తర్వాత-ఇప్పుడు రేవంత్ ను స్వయంగా కలిసి భేటీ వేశారు. ఈ భేటీ పరమార్థం నిధుల సమీకరణ గురించిన వ్యవహారమే అని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇప్పటిదాకా షర్మిల సారథ్యంలో ప్రోగ్రెస్ ను సమీక్షించి.. జగన్ కు మరింత డ్యామేజీ జరిగేలా విమర్శలతో రెచ్చిపోయేలా రేవంత్ మార్గదర్శనం చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. నిధుల గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా దూసుకెళ్లిపోవాలని భరోసా ఇచ్చినట్గుగా కూడా చెప్పుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?