చిరంజీవి కథకు హీరో కావలెను

చిరంజీవి హీరో అయితే ఆయన కథకు హీరో కావాల్సిరావడం ఏమిటి? అని తొందరపడిపోవద్దు. చిరంజీవి కోసం, ఆయన చేయాలని అనుకున్నా ముందుకు వెళ్లని కథ కొసం ఇప్పుడు హీరో కావాలి. అదీ సంగతి. Advertisement…

చిరంజీవి హీరో అయితే ఆయన కథకు హీరో కావాల్సిరావడం ఏమిటి? అని తొందరపడిపోవద్దు. చిరంజీవి కోసం, ఆయన చేయాలని అనుకున్నా ముందుకు వెళ్లని కథ కొసం ఇప్పుడు హీరో కావాలి. అదీ సంగతి.

నక్కిన త్రినాధ్, బెజవాడ ప్రసన్న ఇద్దరూ కలిసి ఓ మంచి తండ్రీ కొడుకుల కథను వండారు. చాలా ఫన్ స్టోరీ ఇది. ఈ కథను ఆయన విన్నారు. సరే కొడుకు పాత్ర ఎవరు చేస్తారు అన్నపుడు తేజ సజ్జాకు కబురు చేసారు. డిస్కషన్లు జరిగాయి. కానీ గమ్మత్తుగా సిద్దు జొన్నలగడ్డ పేరు బయటకు వచ్చింది. మొత్తానికి ఆ ప్రాజెక్టు అలా అక్కడే వుండిపోయింది.

ఇప్పుడు నక్కిన-బెజవాడ ఆ కథను ఎవరితో చేయాలా అని ప్రయత్నిస్తున్నారు. కొడుకు పాత్రకు తేజ సజ్జా రెడీనే. తండ్రి పాత్రకు కావాలి. మన సీనియర్ హీరోలు ఎంత సీనియర్లు అవుతున్నా, మనవల్ని ఎత్తుకున్నా తండ్రి పాత్రలు చేయడం అంటే కిలో మీటర్ దూరంలో వుంటారు. గమ్మత్తేమిటంటే ఇదే సీనియర్ హీరోలు యంగ్ ఏజ్ లో మాత్రం బుర్రకు తెల్ల రంగు వేసుకుని తండ్రి పాత్రలు ధరించి డబుల్ పోజ్ సినిమాలు చేస్తారు.

సరైన పెద్ద సీనియర్ హీరోనే ఈ తండ్రి పాత్ర చేయాలి. అప్పుడే సినిమా ఓ లెవెల్ లో వుంటుంది. కానీ మనకున్న సీనియర్ హీరోలు చిరు, నాగ్, వెంకీ, రవితేజ, బాలయ్య. వాళ్లెవరు ఈ పాత్రను చేసే మూడ్ లో వున్నట్లు కనిపించడం లేదు. అందువల్ల నక్కిన-బెజవాడ వండిన కథ అలా వుండిపోవాల్సిందే. లేదా చిన్న లెవెల్ లో ఏ రావు రమేష్ కాంబినేషన్‌లోనో తీసుకోవాల్సిందే.