బిడ్డ పోయినా పురిటికంపు పోలేదు అన్నది సామెత. యాత్ర 2 వ్యవహారం అలాగే వుంది. సినిమా పెద్దగా ఆడలేదు. అది వాస్తవం. కానీ ఇంకా సినిమా ప్రచారంలోనే వుంది. ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ చేస్తోంది. అది ఆ పార్టీ అభిమాన ‘కుల’ సంభవులకు తెలియడం లేదు. ఇన్ని ఏళ్ల తరువాత ఓ ‘రెడ్డి’సామాజిక వర్గం స్టూడియో కట్టడానికి ముందుకు వచ్చింది. స్టూడియో లేదు.. ఏదీ లేదు.. రెండు ఎకరాలు కొట్టేయడానికి ఇది ప్లాన్ అన్నది తెలుగుదేశం అను.. కుల.. మీడియా వాదన. కాస్సేపు అదే నిజం అనుకుందాం.
ఓ కమిటీ వేసి, హైదరాబాద్ ఫిలిం నగర్లో ఇళ్ల స్థలాలు ఏ కులానికి ఎన్ని దక్కాయి.
స్టూడియో స్ధలాలు ఏ కులానికి ఇచ్చారు.
ఏ కులం ముఖ్యమంత్రి ఇచ్చారు.
రికార్డింగ్ స్టూడియో అని చెప్పి షాపింగ్ క్లాంప్లెక్స్ కట్టింది ఏ కులం వారు.
దాంట్లో టాప్ ఫ్లోర్ లో ఓ గదికి రికార్డింగ్ స్టూడియో అని పేరు తగిలించేసి సరిపెట్టింది ఎవరు?
హైదరాబాద్‌లో రోడ్ వైడనింగ్‌లో స్థలం పోతే, విశాఖలో విలువైన స్థలం దక్కించుకున్నది ఏ కులం వారు?
విశాఖలో గెడ్డలు ఆక్రమించి మరీ కాంప్లెక్స్‌లు కట్టింది ఏ కులం వారు?
అన్నపూర్ణ స్టూడియో మీదుగా తెలుగుదేశం ఆఫీసు, ప్రసాద్ ల్యాబ్ ప్రసాద్ ఐ ఆసుపత్రి, ఇలా కొన్ని ఎకరాలు ఒకే చోట ఒకే కులానికి ఎలా దఖలు పడ్డాయి.
ఏ ముఖ్యమంత్రి కుడిచేత్తే దరఖాస్తు చేసి, ఎడమచేత్తో తన స్టూడియోని కమర్షియల్ కాంప్లెక్స్ చేసుకొవడానికి ఎడంచేత్తో అనుమతి ఇచ్చేసారు?
విశాఖలో సముద్రం ఎదురుగా విలువైన కొండను ఇంత ధర అని నిర్ణయించి ఓ స్టూడియోకి ఇచ్చేసింది ఎవరు? ఏ కులపోళ్లకి?
ప్రభుత్వం ఓ పర్పస్ కోసం స్ధలాలు ఇచ్చిన తరువాత వాటిని కమర్షియల్ పర్సస్కు మార్చవచ్చా. హైదరాబాద్ ఫిలిం నగర్లో ఇలా మారినవి ఎన్ని?
ఇలా రాసుకుంటూ పోతే ఓ కుల భూ భాగోతం ఇంతా అంతా కాదు.
మేం చేసాం.. మీరూ తప్పు చేసారని ఒప్పుకోండి అంటూ ఇంకో వాదన. అసలు రెండు ఎకరాలు మదనపల్లిలో ఇరవై కోట్లు వుంటుందా? ఆ రేటుకు కొనడానికి ఈ సోకాల్డ్ కుల మీడియా ముందుకు వస్తుందా?
ఇవన్నీ ఓ కమిటీని వేసి నిగ్గు తేల్చడానికి సిద్దమేనా? వేయండి కమిటీ.
సరే ఇక ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీకి చేస్తున్న డ్యామేజ్ ఇంతా అంతా కాదు. ఎందుకంటే పైన పేర్కొన్న విషయాలు ఏవీ కొత్తవి కాదు. అందరికీ తెలిసినవే. కళ్ల ముందు కనిపించినవే. కానీ ఇప్పుడు ఒక్క పర్సన్ కు రెండు ఎకరాలు అది వెనుకబడ్డ రాయలసీమలో కేటాయిస్తే ఇంత యాగీ చేస్తుందే అదే కులపోళ్లకి, అదే రాయలసీమ వాళ్లకి ఎలా వుంటుంది? ఎంత మండుతుంది? అదే డ్యామేజ్ కు దారి తీస్తోంది.
తెలుగుదేశం అను కుల మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ సంగతి గమనించి వెనక్కు తగ్గింది. కానీ కుల తోక మీడియాలు మాత్రం ఇంకా ఊగుతూనే వున్నాయి. అవి ఇలా ఎంత ఊగితేె అంత డ్యామేజ్. అదెప్పుడు గ్రహిస్తారో.. అప్పుడు సైలంట్ అవుతారు.