ఆర్కే భయపడ్డాడ్రోయ్

తెలుగుదేశం పార్టీకి సదా మద్దతుగా నిలిచే మీడియాల్లో ఆంధ్రజ్యోతి ఒకటి అన్నది జగమెరిగిన సత్యం. అాయితే అదే మీడియా తెలంగాణలో మాత్రం వీలయినంత వినయంగా వుంటూ వస్తోంది. అప్పడప్పుడు కలం జాడిస్తే చాలు కేసిఆర్ నుంచి అక్షింతలు…

తెలుగుదేశం పార్టీకి సదా మద్దతుగా నిలిచే మీడియాల్లో ఆంధ్రజ్యోతి ఒకటి అన్నది జగమెరిగిన సత్యం. అాయితే అదే మీడియా తెలంగాణలో మాత్రం వీలయినంత వినయంగా వుంటూ వస్తోంది. అప్పడప్పుడు కలం జాడిస్తే చాలు కేసిఆర్ నుంచి అక్షింతలు తప్పవు. ఆ మధ్య అలాగే గట్టిగా అక్షింతలు పడేసరికి, తామేం భయపడిపోమని, కళ్లు పెద్దవి చేసి చూస్తే భయపడిపోయేవారు ఎవరూ లేరిక్కడి అని బింకాలు పోయారు. కానీ వాస్తవానికి మాత్రం వ్యవహారం వేరుగా వుంది. కరోనా నేపథ్యంలో ఆంధ్ర వరకు వచ్చేసరికి చిత్రాతి చిత్రమైన వార్తలు వండి వారుస్తున్నారు. 

ఒకోసారి కేసులు దాచేస్తున్నారంటారు. ఒకోసారి లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు అంటారు. మరోసారి లాక్ డౌన్ నీరుగారుస్తున్నారు అంటారు. ఇలా రోజూ రకరకాల వార్తలు వండి వారుస్తుంటారు. కేసుల సంఖ్య ఎలా అయితే భూతద్దంలో కనిపిస్తుంది అనే దిశగా ప్రయత్నిస్తుంటారు. అంతే కానీ, ఆంధ్రలో కరోనా టైమ్ లో కూడా ప్రజలకు నిత్యావసరాలు సమస్య లేకుండా లభిస్తున్నాయన్న సంగతి కానీ, దేశం మొత్తం మీద అత్యథికంగా టెస్ట్ లు జరుగుతున్న సంగతి కానీ ప్రస్తావించవు. అదే సమయంలో తెలంగాణలో మాత్రం గట్టిగా మాట్లాడ్డం పూర్తిగా మానుకున్నాయి.

ఉదాహరణకు 24 వ తేదీ శుక్రవారం నాటి పత్రికలు చూద్దాం.

ఆంధ్ర ఎడిషన్ ఫ్రంట్ పేజీలో..

ఒకే రోజు 80 కేసులు
రోజువారీ లెక్కల్లోతెలుగు రాష్ట్రాల్లోనే అత్యథికం (అంతే కానీ ఎన్ని వేల టెస్ట్ లు చేస్తే ఇన్ని పాజిటివ్ లు వచ్చాయన్నది ప్రస్తావించరు).
బతుకు లాక్ డౌన్
కేసులకు ఏదీ డౌన్
భవనాలకు అదే రంగులు
ఇలా తొలి పేజీలోనే బొలెడు వార్తలు.

మరి తెలంగాణ ఎడిషన్ సంగతి చూద్దాం.
రోజుకు వెయ్యి పరీక్షలు
కట్టడికి 28 రోజలు (ఇధే వార్తకు ఆంధ్రలో బతుకు లాక్ డౌన్ అన్నది శీర్షిక)
ఇంటి అద్దె వసూలుకు మూడు నెలలు బ్రేక్
అంతే. ఇవే కరోనా వార్తలు తొలి పేజీలో.

ఈ ఒక్కరోజే కాదు, కేసిఆర్ హెచ్చరిక నాటి నుంచీ మారుతున్న తీరు ఇది. అంటే కేసిఆర్ కళ్లెర్ర చేస్తే ఆర్కే బాబు భయపడ్డాడని అనకోవాల్సిందేగా.

నమస్కారమే మన సంస్కారం