ఆర్కే వెల్లడించిన నిజాలు/గ్యాసిప్ లు!

ఆంధ్రజ్యోతి ఆర్కే చాలా సీనియర్ జర్నలిస్ట్. ప్రస్తుతం ఓ పత్రికకు అధిపతి.అందువల్ల ఆయనకు చాలా నిజాలు తెలుస్తాయి. నిజాలు అనే కన్నా, ఇన్ సైడ్ బోగట్టాలు అని అనుకోవడం బెటరేమో? అలాంటివి అన్నీ ఆయన…

ఆంధ్రజ్యోతి ఆర్కే చాలా సీనియర్ జర్నలిస్ట్. ప్రస్తుతం ఓ పత్రికకు అధిపతి.అందువల్ల ఆయనకు చాలా నిజాలు తెలుస్తాయి. నిజాలు అనే కన్నా, ఇన్ సైడ్ బోగట్టాలు అని అనుకోవడం బెటరేమో? అలాంటివి అన్నీ ఆయన వారం వారం ఆయన వండి వార్చే కొత్త పలుకులో తళుక్కున మెరుస్తుంటాయి. అలాంటి విషయాలు కొన్ని ఈవారం కనిపించాయి.

''…..ఇందిరాగాంధీ హయాంలో పి.శివశంకర్‌ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉండేవారు. ఆయన హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయమూర్తులు కొందరు తమ వాహనాలను దూరంగా పార్క్‌ చేసి, సందుల్లో నడుచుకుంటూ వెళ్లి ఆయనను కలుసుకునే వారు. కేంద్ర మంత్రిని తాము కలిసిన విషయం ప్రతిపక్షాలకు తెలియకూడదన్న ఉద్దేశంతో వారలా చేసేవారు….''

ఇది ఆర్కే వెల్లడించిన ఓ విషయం.

న్యాయమూర్తులు అంటే సమాజం అత్యున్నతంగా గౌరవించే వృత్తిలో వున్నవారు. పైగా అన్ని వ్యవస్థలకన్నా బలమైన వ్యవస్థ అది. మరి అలాంటి వృత్తి, వ్యవస్థల్లో వున్నవారు సందుల్లోంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏమిటి? అలా వెళ్లి కేంద్రమంత్రిని కలిసిరావడం ఏమిటి? పైగా ఈ విషయం ప్రతిపక్షానికి తెలియకూడదు అంటే ఏమిటి? న్యాయమూర్తులు, సంబంధత శాఖ మంత్రిని నేరుగా కలిస్తే వచ్చే తప్పేమిటి? ఆ విషయం ప్రతిపక్షాలకు తెలిస్తే తప్పేమిటి? 

ఇలాంటి రాతల వల్ల జనాల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించినట్లు కాదా? అంత రహస్యంగా, సందుల్లోంచి వెళ్లి మరీ మన ఉమ్మడి ఆంధ్ర న్యాయమూర్తులు ఆ రోజుల్లో న్యాయశాఖ మంత్రిని ఎందుకు కలిసివచ్చినట్లు? అని జనం ఇప్పుడు గుసగుసలు పోరా? 

ఏమంటారు ఆర్కే…?

ఇక రెండో విషయానికి వద్దాం.

''……చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక భారీ ఆపరేషన్‌లో పలువురు నక్సలైట్‌ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జరిగిన తర్వాత, అప్పుడు హోం మంత్రిగా ఉన్న నాయకుడు విరసం నేత వరవరరావుకు ఫోన్‌ చేసి జరిగిన దానితో తనకేమీ సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు. ఈ సంభాషణను రికార్డు చేసిన సంబంధిత అధికారులు ముఖ్యమంత్రిని కలిసి వినిపించారు. అప్పటి నుంచి నక్సలైట్లకు సంబంధించిన ఆపరేషన్ల విషయంలో పోలీసు అధికారులు హోం మంత్రులకు అటువంటి విషయాలు తెలియనిచ్చేవారు కారు. ….''

ఇది మరీ దారుణం.

ఇక్కడ రెండు మూడు విషయాలు వున్నాయి.

ఒకటి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వుండగా, తన హోం మంత్రి ఫోన్ లు కూడా రికార్డు చేయించేవారు అన్నది.

రెండు. అప్పటి హో మంత్రికి నక్సలైట్ సానుభూతిపరులు లేదా నక్సలిజం భావజాలం వున్నవారితో సన్నిహిత సంబంధాలు వుండేవి.

మూడు. ఎన్ కౌంటర్ కు హో మంత్రి నక్సలిజం సానుభూతి పరులుకు సంజాయషీ ఇచ్చుకున్నారు.

నాలుగు. ఆ తరువాత సదరు హోం మంత్రికి నక్సలైట్లకు సంబంధించివ కార్యకలాపాలను పోలీసులు చెప్పడం మానేసారు.

అంతేగా ఆర్కే సాబ్?

ఇంతకీ ఎప్పుడు జరిగిన ఆపరేషన్ అది? ఎవరా హోం మంత్రి? తన హోం మంత్రి మీదే చంద్రబాబు నిఘా పెట్టారా? ఇక మంత్రులు అందరిమీదానా? మంత్రులపైనే నిఘా  పెట్టించిన చంద్రబాబు మిగిలినవారిని వదిలేసి వుంటారా? ఆ రోజుల్లో?

మొత్తం మీద ఆర్కే భలే గ్యాసిప్ లు వెల్లడిస్తుంటారు. ఏమంటారు?

కమ్మ వారికి చంద్రబాబు చేస్తున్న నష్టం ఎంత