శ్రీరాముడిగా ప్రభాస్.. ఆల్రెడీ పని మొదలైంది

బాహుబలి ప్రాజెక్టు కోసం దాదాపు 8 నెలలు కష్టపడ్డాడు ప్రభాస్. శివుడి పాత్ర కోసం సన్నగా, బాహుబలి పాత్ర కోసం కాస్త లావుగా కనిపించడానికి చాలా శ్రమించాడు. ఇప్పుడు మరోసారి ప్రభాస్ కు అలాంటి…

బాహుబలి ప్రాజెక్టు కోసం దాదాపు 8 నెలలు కష్టపడ్డాడు ప్రభాస్. శివుడి పాత్ర కోసం సన్నగా, బాహుబలి పాత్ర కోసం కాస్త లావుగా కనిపించడానికి చాలా శ్రమించాడు. ఇప్పుడు మరోసారి ప్రభాస్ కు అలాంటి సవాల్ ఎదురైంది. ఈసారి శ్రీరాముడిగా ఆయన కనిపించాలి.

మరి రాముడి పాత్ర కోసం తన శరీరాన్ని మలుచుకునేందుకు ప్రభాస్ ఎలాంటి హోమ్ వర్క్ చేస్తున్నాడు? దానికి ఇంకా ఎంత టైమ్ తీసుకుంటాడు? సో.. ఈ సినిమా రావడానికి చాలా టైమ్ పట్టేలా ఉందనే ప్రచారం మొదలైంది. అయితే రాముడి పాత్ర కోసం ప్రభాస్ ఎప్పుడో కసరత్తులు మొదలు పెట్టాడని ప్రకటించాడు దర్శకుడు ఓం రౌత్.

“ఓ విలుకారుడి ఫిజిక్ కావాలి. వారియర్ ఫిజిక్ కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. వారియర్ నుంచి విలుకారుడిగా మారేందుకు ప్రభాస్ ఆల్రెడీ పని మొదలుపెట్టాడు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలామంది నిపుణుల్ని కలిశాం. అంతేకాదు… త్వరలోనే ప్రభాస్, ఆర్చరీ కూడా నేర్చుకోబోతున్నాడు.”

ఇలా ప్రభాస్ మేకోవర్ పై స్పందించాడు దర్శకుడు. నిజానికి ఇది సడెన్ గా ప్రకటించిన ప్రాజెక్టు కాదని, లాక్ డౌన్ కంటే ముందే ఓకే అయిందని, అందుకే ప్రభాస్ కు వర్కవుట్స్ కు టైమ్ దొరికిందని అంటున్నాడు దర్శకుడు. మరోవైపు తన ప్రాజెక్టుపై కొవిడ్ ప్రభావం అస్సలు ఉండదని చెబుతున్నాడు.

“నా సబ్జెక్ట్ పై నాకు నమ్మకం ఉంది. మరీ ముఖ్యంగా నా యాక్టర్ ప్రభాస్, నిర్మాత భూషణ్ కుమార్ పై చాలా నమ్మకం ఉంది. కరోనా ఇక్కడే ఉండిపోదు. త్వరలోనే ఇది పోతుంది. కమ్యూనిటీ ఎంటర్ టైన్ మెంట్ (మల్టీప్లెక్స్, సినిమా హాళ్లు) ఎక్కడికీ పోదు. ఆదిపురుష్ లాంటి లార్జర్ దేన్ లైఫ్ సినిమాను కచ్చితంగా థియేటర్ లోనే చూడాలి. ఓ ఫిలింమేకర్ గా నా అసలైన పని అదే. ప్రేక్షకుడు పెట్టే ప్రతి పైసాకు కచ్చితంగా వినోదం అందిస్తాను. ఇది మాత్రం పక్కా.”

రాముడి పాత్ర పోషించడానికి ఏ నటుడికైనా ప్రశాంత వదనం, ఉగ్రరూపం రెండూ ఉండాలని.. ఆ రెండు లక్షణాల్ని తను ప్రభాస్ లో చూశానని చెబుతున్నాడు దర్శకుడు. స్క్రిప్ట్ దశ నుంచి క్యారికేచర్ వరకు ఏ దశలోనూ తనకు ప్రభాస్ తప్ప మరో హీరో గుర్తురాలేదంటున్నాడు.

సీఎం అవ్వ‌డమంటే అంత ఈజీనా

చంద్రబాబుకి తెలంగాణాలో నోరెత్తే దమ్ములేదు