Advertisement

Advertisement


Home > Politics - Gossip

తిరుగుబాటా? కాషాయ కుట్రా??

తిరుగుబాటా? కాషాయ కుట్రా??

మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చాం అనే ఆనందం పాపం.. కాంగ్రెస్ పార్టీకి మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలినట్లు కనిపిస్తోంది. గత కొన్ని వారాలుగా మధ్యప్రదేశ్ లోని కమల్‌నాధ్ సర్కారు అస్థిరంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదంతా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో భాజపా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వల విసురుతున్న పరిణామంగా ప్రచారం జరిగింది. కానీ, తాజాగా కాంగ్రెసు పార్టీలో అంతర్యుద్ధం బయటపడింది.

ఏకంగా 17 మంది ఎమ్మెల్యేలు మాయం అయ్యారు. వారందరికీ రింగ్ లీడర్ అనదగిన మార్గదర్శి నాయకుడు, యువనేత జ్యోతిరాదిత్య సింధియా కూడా అందుబాటులో లేరు. సరిగ్గా ఈ కీలక సమయంలో.. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి సిద్ధం అవుతోంది. కమల్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే ఇదంతా కూడా కమలదళం చేస్తున్న కుట్రల ఫలితమేనా? లేదా, కేవలం కాంగ్రెస్ పార్టీలోని అంతర్యుద్ధం, తిరుగుబాటుల ఫలితమా అనేది మాత్రం స్పష్టం కావడం లేదు. కొన్నాళ్ల కిందట కొందరు ఎమ్మెల్యేలు మాయం అయినప్పుడు భాజపా కుట్రగా అంతా అభివర్ణించారు. కానీ.. ఏకంగా 17మందితో సహా... సీఎం పీఠంపై తొలినుంచి ఆశ పెట్టుకున్న జ్యోతిరాదిత్య కూడా మాయం కావడం విశేషం.

దీనిని భాజపా కుట్ర అనుకోవడానికి కూడా పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. జ్యోతిరాదిత్య సింధియా భాజపా వైపు చూస్తున్నట్లుగా చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ 17మంది అదృశ్యం అయిన సమయంలోనే.. భాజపా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం అంటే.. మాయమైన వారితో వారికి ఒక ముందస్తు అవగాహన ఉన్నదనే అనుకోవాల్సి ఉంటుంది.

మధ్యప్రదేశ్ లో మాయమైన ఎమ్మెల్యేలు ఒక ప్రత్యేక విమానంలో బెంగుళూరు చేరుకుని రిసార్టులో సేద తీరుతున్నట్లు సమాచారం. ఆ ఎమ్మెల్యేలందరూ  కూడా జ్యోతిరాదిత్య వర్గంగా గుర్తింపు ఉన్నవారే కావడం విశేషం.

భాజపా కుట్ర కాకపోయినప్పటికీ.. కాంగ్రెస్ అంతర్గత తిరుగుబాటు ఫలితం కూడా కావొచ్చు. జ్యోతిరాదిత్య ఎన్నికల ప్రచారంలో బాగా వాడుకుని సీఎం పీఠం ఇవ్వలేదనే అభిప్రాయం ఆయన వర్గంలో ఉంది. ఇప్పుడు అదను చూసి ఆయన ప్రభుత్వం కూలిపోవడానికి పావులు కదుపుతుండవచ్చుననే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

టీడీపీ మళ్ళీ నందమూరి చేతుల్లోకేనా..?

ఒక ప్రిన్సిపల్ కడుపులో గుండాగాడు పుట్టాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?