Advertisement

Advertisement


Home > Politics - Gossip

సాక్ష్యం..లాకర్ లో పెట్టేసారా ఆర్కే?

సాక్ష్యం..లాకర్ లో పెట్టేసారా ఆర్కే?

రఘురామరాజు అరెస్ట్ కేసుల్లో ఎన్ని వింతలు జరగాలో, ఎంత హడావుడి జరగాలో అంతా అయిపోయింది. ఈ కేసులో రెండు మీడియా ఛానెళ్లు వున్నాయి. ఇప్పటికి కేసు అయిపోలేదు. దర్యాప్తు అయిపోలేదు. తీర్పు ఇంకా చాలా దూరం వుంది. కానీ ఈ లోగా ఈ విషయం మీద ఎంత రాయాలో అంతా రాసారు కాలమిస్ట్ ఆర్కే. 

సరే, అది ఆయన ఇష్టం. ఆయన పెన్. ఆయన బాధ. అందరూ ఇన్నాళ్లూ ఎల్లో మీడియా అన్నారు అని ఆయన బ్లూ మీడియా అనే పదాన్ని కాయిన్ చేసారు. అందులో ఎన్టీవీ, టీవీ 9, సాక్షి లను మెంబర్లుగా ఆయనే చేర్చేసారు.

తను గొప్పవాడిని అని, తన మీడియా గొప్పదని ఆర్కే చెప్పుకోవచ్చు. తప్పులేదు. సాక్షి టీవీ జగన్ ది కనుక బ్లూ టీవీ అని ముద్ర వేసేసి వుండొచ్చు. టీవీ 9, ఎన్టీవీ లకు నేరుగా పార్టీ బంధాలు ఏవీ లేవు. మరి వాటిని కూడా ఈ లిస్ట్ లో ఎందుకు చేర్చినట్లో? మరి ఆర్కే చేసిన ఈ ఆరోపణను తిప్పి కొట్టడం లేదా మౌనంగా వుండి ఒప్పుకోవడం అన్నది ఆ రెండు చానెళ్ల బాధ్యత.

సరే ఇది ఇలా వుంటే ఆర్కే చెప్పిన మరో గొప్ప విషయం మరోటి వుంది. రఘరామరాజు మెడికల్ పరిక్ష విషయంలో ప్రభుత్వం డాక్టర్లపై ప్రభుత్వం విపరీతంగా ఒత్తిడి తెచ్చిందని, దీనికి సంబంధించిన సాక్ష్యాలు తన దగ్గర వున్నాయనే విషయాన్ని ఆర్కే వెల్లడించారు.

నిజానికి ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. మెడికల్ రిపోర్టు విషయంలోనే కీలకమైన వాదనలు సాగాయి. ఆఖరికి మిలటరీ ఆసుపత్రికి రిఫర్ చేసారు. మరి ఇలాంటి కీలకమైన వాదన సమయంలో ఆ కేసులో నెంబర్ టూ గానో, త్రీగానో వున్న ఎబిఎన్ కు యజమాని అయిన ఆర్కే తన దగ్గర వున్న కీలక సాక్ష్యాలను సుప్రీం కోర్టు ముందు ఎందుకు వుంచలేదు. 

సంచలనం సృష్టించడానికి వున్న ఈ అవకాశాన్ని ఆయన వదులుకుని, కేవలం ఈ విషయాన్ని కేవలం తన కాలమ్ లో రాసుకోవడానికే ఎందుకు దాచుకున్నట్లో? పోనీ భవిష్యత్ లో అయినా ఈ సాక్ష్యాన్ని బయటకు తీస్తారా? లాకర్ లోనే దాస్తారా? 

ఒక వేళ అలాంటి సాక్ష్యం ఏదీ లేదని, అంతా బుస్ అని తేలిపోతే ఓ సీనియర్ జర్నలిస్ట్ గా, ఓ మెయిన్ స్ట్రీమ్ మీడియా యజమానిగా, ఓ కాలమిస్ట్ గా ఆర్కే అడ్డంగా అబద్దాలు ఆడేస్తారనే ముద్ర ను జీవితాంతం మోసేస్తారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?