చంధ్రబాబూ..ఇది విన్నారా? ఎంత అన్యాయం?

అన్యాయం జరిగిపోయింది బాబుగారూ…అన్యాయం జరిగిపోయింది. ఆంధ్రలో అప్పులుతప్ప అభివృద్ది లేదు..లేదు అని మనమూ, మన అనుచరగణం గగ్గోలు పెడుతున్నామా? మన అను'కుల' మీడియా సంగతి అయితే చెప్పనక్కరలేదు కదా..డాల్బీ డిటీఎస్ సౌండ్ లో ఇదే…

అన్యాయం జరిగిపోయింది బాబుగారూ…అన్యాయం జరిగిపోయింది. ఆంధ్రలో అప్పులుతప్ప అభివృద్ది లేదు..లేదు అని మనమూ, మన అనుచరగణం గగ్గోలు పెడుతున్నామా? మన అను'కుల' మీడియా సంగతి అయితే చెప్పనక్కరలేదు కదా..డాల్బీ డిటీఎస్ సౌండ్ లో ఇదే నిత్యం వినిపిస్తోంది. జనం నమ్మాలి.నమ్మి తీరాలి అంటోంది. 

కానీ అదేంటీ..నీతి అయోగ్ అలా చేసింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి (ఎస్ డి జి ఇండెక్స్) ఫలితాలు ఈ రోజు ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన ప్రకారం 169 అంశాల్లో 17 లక్ష్యాల సాధనను నీతి అయోగ్ పర్యవేక్షిస్తుంది. ఈ మేరకు ర్యాంకులు ప్రకటిస్తూ వుంటుంది. ఈ సంగతి చంద్రబాబుకు తెలియంది కాదు కదా. 

అలా ఈ రోజు ప్రకటించిన ర్యాంకుల జాబితాలో ఆంధ్రకు మూడో ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ ను కేరళ సాధించింది. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రెండో ప్లేస్ ను సాధించాయి. ఆంధ్ర కు మూడో ర్యాంక్ వచ్చింది. కేరళకు 75 పాయింట్లు వస్తే,  ఆంధ్రకు 73 పాయింట్లు వచ్చాయి. అంటే ఫస్ట్ ప్లేస్ కు థర్డ్ ప్లేస్ కు రెండు పాయింట్లు తేడా మాత్రమే.

అన్నట్లు అభివృద్ది అంతా తెలంగాణలోనే, ఆంధ్ర జనాలు అంతా తెలంగాణ కేసి చూస్తున్నారు అని చెబుతున్నారు. కానీ ఆ తెలంగాణకు వచ్చిన పాయింట్లు 69 మాత్రమే. అన్నింటికన్నా వరస్ట్ ఫెర్ ఫార్మర్ ఎవరు అంటే బీహార్ నే. 

అవును..ఇంతకీ ఇది ఎలా సాధ్యం? చంద్రబాబు అండ్ కో చూస్తుంటే ఆంధ్ర అధోగతిలో వుంది. జనం పెద్ద తప్పు చేసారు. జగన్ అనే రాక్షసుడికి అధికారం ఇచ్చారు. ఎన్నో దశాబ్దాల వెనక్కు వెళ్లిపోయింది రాష్ట్రం అని అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వ నీతి అయోగ్ సర్వే వేరే చెబుతోంది. ఏమిటీ అన్యాయం చంద్రబాబూ? దీన్ని మీరు ఖండించాల్సిందే?