రాష్ట్రమంతా అమరావతి పోరాటాలు.. సాధ్యమేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేది అమరావతి లో మాత్రమే ఉండాలని, అధికార వికేంద్రీకరణ తగదని పెద్ద పోరాటాలే జరుగుతూ ఉన్నాయి. పోరాటం చేస్తున్నది కేవలం 29 గ్రామాల వారు మాత్రమే అయినప్పటికీ.. 72 రోజులకు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేది అమరావతి లో మాత్రమే ఉండాలని, అధికార వికేంద్రీకరణ తగదని పెద్ద పోరాటాలే జరుగుతూ ఉన్నాయి. పోరాటం చేస్తున్నది కేవలం 29 గ్రామాల వారు మాత్రమే అయినప్పటికీ.. 72 రోజులకు పైగా పట్టువిడవకుండా పోరాడుతున్నారు. అయితే ఈ పోరాటాలను రాష్ట్రమంతా విస్తరింపజేయాలని.. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లోను రాజధాని పోరాటాలు సాగాలని తాజాగా అమరావతి ఐకాస నిర్ణయం తీసుకుంది. రాష్ట్రమంతా గనుక.. ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న తీరుగానే పట్టువిడవని పోరాటాలు జరిగితే గనుక.. అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన రెడ్డి తీసుకున్న నిర్ణయం తప్పేమోనని సమీక్షించవచ్చు. కానీ.. అమరావతి రాజధాని కోసం 13 జిల్లాల్లో ప్రజలు పోరాటం చేయడం అనేది సాధ్యమేనా? అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణకు సంకల్పించింది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా అభివర్ణించే మూడు వ్యవస్థలను మూడు ప్రాంతాలు, మూడు నగరాలకు విస్తరించి.. సమతుల్య అభివృద్ధి తీసుకురావాలని అనుకుంది. అయితే తమ వద్ద శాసన రాజధాని యథాతథంగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ రాజధానులు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు తరలివెళ్లడమే తప్పు అన్నట్లుగా అమరావతి వారు పోరాడుతున్నారు.

అయితే ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయం విషయంలో దృఢంగానే ఉంది. కేంద్రంనుంచి కూడా పెద్దగా ఆటంకాలు ఉండకపోవచ్చునని పలువురి విశ్లేషణ. ఇలాంటి నేపథ్యంలో.. అమరావతి పోరాటానికి పురిగొల్పి.. కొన్నాళ్లపాటు నాయకత్వం వహించిన తెలుగుదేశం పార్టీ తర్వాత తమ గళం పలుచన చేసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ అంతో ఇంతో కార్యకర్తల బలం పుష్టిగా కలిగి ఉన్న తెలుగుదేశం.. అమరావతి అనుకూల ర్యాలీలను ఇతర ప్రాంతాల్లో నిర్వహించదలచుకున్నప్పుడు అవి పేలవంగా జరిగాయి. పార్టీకి పరువు నష్టం తప్ప మరేం మిగల్లేదు.

అలాంటిది.. రాష్ట్రవ్యాప్తంగా అమరావతి కోసం పోరాటాల్ని ఐకాస ఎలా చేపట్టగలుగుతుంది. అమరావతిని సమర్థిస్తున్న కమ్యూనిస్టు, జనసేన పార్టీలు పార్టీలకు రాష్ట్రమంతా ఉన్న బలం ఎంత? తెలుగుదేశానికే చేతకాని పోరాటాలు.. అసలు క్షేత్రస్థాయి వ్యవస్థ కూడా నిండుగా లేని పార్టీలు ఏం చేయగలవు? ఎలా సాధ్యం అనే అనుమానాలున్నాయి. ఒక్క ప్రాంతం అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాల వారిని పోరాడాలని కోరుతున్న తర్కరహితమైన డిమాండ్ తో వారు ఎలా సఫలం కాగలరని పలువురు అంటున్నారు.

ఇంటి ప‌నుల‌తో పాటు బాడీ మసాజ్ లు చేయిచుకుంటున్న యాంక‌ర్‌ ?