‘మేకర్ మదిలో కింగ్ కాదు క్వీన్’ ?

మోడీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలను సంఘటితం చేసి జాతీయ స్థాయిలో ఒక బలమైన ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకోవడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కసరత్తు చేస్తున్నారు.  దేశంలోని అనేక  బలమైన ప్రాంతీయ పార్టీలతో ఆయన టచ్…

మోడీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలను సంఘటితం చేసి జాతీయ స్థాయిలో ఒక బలమైన ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకోవడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కసరత్తు చేస్తున్నారు.  దేశంలోని అనేక  బలమైన ప్రాంతీయ పార్టీలతో ఆయన టచ్ లో ఉంటూ…  వారు  స్థానికంగా రాజకీయంగా బలోపేతం కావడానికి తన వంతు తోడ్పాటు అందిస్తూ వస్తున్నారు. అయితే జాతీయస్థాయిలో మోడీ కి ప్రత్యామ్నాయం తయారు చేయదలచుకున్న ప్రశాంత్ కిషోర్ మదిలో కింగ్ ఎవరు? అనే చర్చను లేవదీస్తూ ‘గ్రేట్ ఆంధ్ర’ వారపత్రిక ఇటీవలే ముఖ చిత్ర కథనం  అందించింది.  తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఉంటే..  ఆయన వ్యూహాల్లో ఉన్నది కింగ్ కాదు క్వీన్ అని మనకు అర్థం అవుతోంది. ఆ క్వీన్ మరెవరో కాదు మమతా దీదీ మాత్రమే అని కూడా అనిపిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో తృణమూల్ కాంగ్రెస్ గొంతును రాజ్యసభలో బలంగా వినిపించే యువ నాయకుల కోసం అధినేత్రి మమతా బెనర్జీ పరిశీలిస్తుందని… ఆ క్రమంలో ప్రశాంత్ కిషోర్ ను కూడా ఇప్పుడు జరగబోయే రాజ్యసభ ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ నుంచి ఎంపీ గా ఎంపిక చేస్తారని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు.

ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడానికి తోడ్పడుతూ వస్తున్నారు. బీహార్లోని జేడీయూ లో చేరిన పీకే, భాజపా అనుకూల వైఖరిని నిలదీసి నందుకు ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత మోడీ వ్యతిరేక పార్టీ లను ఏకం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే తో,  పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తో, కర్ణాటకలో జెడిఎస్ తో ఆయన ఎన్నికల వ్యూహరచన ఒప్పందాలు కుదుర్చుకుని ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం ఖాళీ అవుతున్న ఎంపీ స్థానాలలో 4 మమతా దీదీకి మళ్లీ దక్కే అవకాశం ఉంది. కాంగ్రెస్ సీపీఎం మద్దతిస్తే కనుక మరొక స్థానం కూడా వారు సొంతం చేసుకుంటారు. ఈ పరిస్థితుల్లో రాజ్యసభలో ప్రభుత్వ వ్యతిరేక స్వరాన్ని బలంగా వినిపించడానికి ప్రశాంత్ కిషోర్ ను ఎంపీగా పంపాలని తృణమూల్ కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీని పర్యవసానంగా భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలను సంఘటితం చేసి కేంద్రంలో మోడీకి దీటుగా  నిలబెట్టగలిగినప్పుడు…  ప్రధాని స్థానం మమతా దీదీ పరమయ్యేలాగా  పీకే సహకరించవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇంటి ప‌నుల‌తో పాటు బాడీ మసాజ్ లు చేయిచుకుంటున్న యాంక‌ర్‌ ?

అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్నపుడే ప్రొడ్యూసర్స్ పై కంప్లైంట్ ఇచ్చేవాడు