విశాఖ వాసుల సెంటిమెంట్‌తో మైండ్ గేమ్!

మైండ్ గేమ్ ద్వారా ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టే కుయుక్తులను పాటించడంలో అపారమైన అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ మళ్లీ అలాంటి అంకానికి తాజాగా తెరతీసింది. విశాఖ వాసుల లోకల్ సెంటిమెంట్‌తో మైండ్ గేమ్ ఆడుతోంది.…

మైండ్ గేమ్ ద్వారా ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టే కుయుక్తులను పాటించడంలో అపారమైన అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ మళ్లీ అలాంటి అంకానికి తాజాగా తెరతీసింది. విశాఖ వాసుల లోకల్ సెంటిమెంట్‌తో మైండ్ గేమ్ ఆడుతోంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని ఏర్పాటుచేస్తున్నందుకు ఒకవైపు ఆ ప్రాంత ప్రజలంతా… హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంటే… వారిలో ఒక అనవసరమైన భయం పుట్టించడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. విశాఖలో చంద్రబాబునాయుడు తలపెట్టిన విషప్రచారానికి ఎదురైన ప్రజాప్రతిఘటన నేపథ్యంలో.. ఇలాంటి కుహనా ప్రచారాలను సాగిస్తుండడం గమనార్హం.

ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ.. జగన్మోహన రెడ్డి తల్లి విజయమ్మను గతంలో ఎంపీగా ఓడించినందుకు విశాఖ ప్రజల మీద ఆయన కక్ష కట్టారని అంటున్నారు. కక్ష కట్టినందుకేనా.. విశాఖను రాజధానిగా ఎంపిక చేసి.. హైదరాబాదు, ఢిల్లీలను తలదన్నేలా అభివృద్ధి చేయాలని జగన్ సంకల్పిస్తున్నది అనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

తెదేపా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇంకో తరహా మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. విశాఖ వాసులను రౌడీలతో పోలుస్తూ వైకాపా నాయకులు ప్రచారం చేస్తున్నారట! ఇది ఇంకా చోద్యం. చంద్రబాబునాయుడు.. మీకు చైతన్యం కలిగిస్తానంటూ విశాఖలో అడుగుపెట్టడానికి ప్రయత్నించినప్పుడు.. మీరు అందించే చైతన్యం మాకు అక్కర్లేదు బాబూ.. తిరిగి వెళ్లిపొండి అని ప్రతిఘటించడమే అక్కడి ప్రజలు చేసిన పని! దానికే వారిని రౌడీలు అంటూ నానా మాటలతో తూలనాడిన వ్యక్తి చంద్రబాబునాయుడే. అలాంటిది.. ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లుగా.. తనను అడ్డుకున్న ప్రజలను తాను రౌడీలంటూ తిట్టడమే కాకుండా.. వైకాపా నాయకులు వారిని రౌడీలన్నారంటూ వక్రభాష్యం చెప్పడం యనమల రామకృష్ణుడుకు మాత్రమే చెల్లిన విద్యలా కనిపిస్తోంది.

మీమీద జగన్ కక్ష కట్టాడు, మిమ్మల్ని జగన్ రౌడీలంటున్నాడు.. అంటూ వక్రభాష్యాలు చెబితే.. నమ్మి చంద్రబాబు బుట్టలో పడిపోవడానికి విశాఖ వాసులు వెర్రిబాగులోళ్లు కాదు. అసలే విశాఖ కాస్మొపాలిటన్ నగరం. ప్రజలు విద్యావంతులు. మంచి చెడులను తమ స్వబుద్ధితో అర్థం చేసుకోగలిగిన వాళ్లు. వాళ్లమీద తమకు నలభయ్యేళ్లుగా అలవాటైన వక్రపూరిత మైండ్ గేమ్ పనిచేస్తుందని అనుకుంటే చంద్రబాబు పప్పులో కాలేసినట్టే.

ఇంటి ప‌నుల‌తో పాటు బాడీ మసాజ్ లు చేయిచుకుంటున్న యాంక‌ర్‌ ?

అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్నపుడే ప్రొడ్యూసర్స్ పై కంప్లైంట్ ఇచ్చేవాడు