Advertisement

Advertisement


Home > Politics - Gossip

ముసలాడైన సంగతి గుర్తించిన సూపర్ స్టార్!

ముసలాడైన సంగతి గుర్తించిన సూపర్ స్టార్!

పడుచు హీరోయిన్లతో సినిమాలు చేస్తున్నప్పుడు గుర్తు రాదేమో గానీ.. రాజకీయాల విషయం వచ్చేసరికి సూపర్ స్టార్ రజనీకాంత్ కు తాను ముసలాడైపోయిన సంగతి గుర్తుకొచ్చింది. తన పార్టీ ఎన్నికల్లో విజయం సాధించినా సరే.. తాను ముఖ్యమంత్రి పీఠం మీద మాత్రం కూర్చోబోయేది లేదని.. పదవిని కుర్రవాళ్లకు అప్పగిస్తానని.. తాను కేవలం పార్టీ ప్రెసిడెంట్ గా మాత్రమే పనిచేస్తానని.. రజనీ చెబుతున్నారు. తనలోని త్యాగగుణాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఇంతకూ రజనీకాంత్ ప్రారంభించిన పార్టీ అప్పుడే అంటే వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చేస్తుందా? అనే సందేహం కలగడం సహజం. ఎందుకంటే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నా డీఎంకే, ఈసారి అధికారం తథ్యం అని తలపడుతున్న డీఎంకే మధ్య హోరాహోరీ పోరాటం ఉంటుంది. మధ్యలో సినిమా అభిమానుల ఓట్లు కాస్తా కమల్-రజనీ మధ్య చీలిపోతాయి. ఈ స్థాయిలో వాతావరణం ఉన్నప్పుడు రజనీ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చేయడం అనుమానమే.

అయితే రజనీ మాత్రం నాకు వయసు అయిపోయింది. ముసలివాడినయ్యాను నాకు ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదు అని అంటున్నారు. పాపం.. ఆయన ఈ పదవి తనకు వద్దని చాలా కాలం కిందటే చెప్పారట.. కానీ ఫ్యాన్స్ ఒప్పుకోలేదట.. అందుకే ఇన్నాళ్లూ అసలు పార్టీ మీదే నిరాసక్తంగా ఉండిపోయారట. ఇప్పుడు మళ్లీ ఓసారి ప్రకటించి.. దయచేసి ఇక తనను ఎవ్వరూ కాబోయే ముఖ్యమంత్రి అని పిలవద్దని ఆయన కోరుతున్నారు. సీఎం పదవిని తమ పార్టీ తరఫున ఒక యువనాయకుడు ఎవరికైనా అందిస్తారట.

అయినా..  అప్పుడే గెలిచిపోయినట్టుగా ఈ ప్రల్లదనాలు ఎందుకో అర్థం కాని సంగతి. ఆయన మాటలు చూస్తోంటే.. అచ్చంగా దళితుడికి సీఎం పీఠం ఇస్తా.. అని ప్రకటించిన కేసీఆర్ గుర్తుకు వస్తున్నారు. ఆయన కూడా ఇలాగే గెలుపు గురించిన కాస్త సందేహం ఉన్నప్పుడు దళిత కార్డు వాడారు.. గెలిచిన వెంటనే.. పార్టీ అంతా కోరుకుంటున్నారు... అంటూ తానే పీఠంపైకి వచ్చారు. రజనీ దళిత కార్డు బదులుగా యువతరం కార్డు వాడుతున్నారు. గెలిచిన తర్వాత.. మళ్లీ ఫ్యాన్స్ మొత్తం ఒత్తిడి చేస్తున్నారంటూ.. ఆయన తిరిగి సీఎం పీఠంపైకి వచ్చినా ఆశ్చర్యం లేదు.

నేను రవితేజ అనుష్క కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకునే వాళ్ళం

నాకు హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటే నచ్చదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?