Advertisement

Advertisement


Home > Politics - Gossip

అరెస్ట్... ఇదే టీడీపీ మెయిన్ టార్గెట్

అరెస్ట్... ఇదే టీడీపీ మెయిన్ టార్గెట్

మీరు మాకొద్దు బాబోయ్.. అంటూ ప్రజలు ఛీత్కరించి ఇంకా నాలుగు నెలలు కూడా కాలేదు. అప్పుడే రాష్ట్రంలో ప్రళయం వచ్చినట్టు, అభివృద్ధి కుంటుపడిపోయినట్టు, అరాచకాలు జరుగుతున్నట్టు టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. ఇలాంటి చీప్ ట్రిక్స్ ని ప్రజలు మళ్లీ మళ్లీ చీదరించుకుంటున్నా పచ్చ బ్యాచ్ మాత్రం వెనకాడ్డంలేదు.

జిల్లాయాత్రల పేరుతో ఓవైపు చంద్రబాబు అరెస్ట్ లతో హడావిడి చేయాలని చూస్తున్నారు. ఆయన ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో ఆరోజు ఆందోళనలతో అట్టుడకాల్సిందే, అదీ ఆయన టార్గెట్. ఇక మరోవైపు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ అయ్యేదాకా ఆందోళన చేపట్టాలి అనే కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నారు. రాష్ట్రంలో ఇసుకకి కొరత వచ్చిందంటూ మాజీమంత్రి కొల్లు రవీంద్ర చేపట్టిన దీక్ష దీనికి తాజా ఉదాహరణ.

మచిలీపట్నంలో చేపట్టిన 36గంటల నిరసన దీక్ష ఈరోజు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని గృహనిర్బంధం చేశారు. దీంతో ఈ అరెస్ట్ లపై టీడీపీ వర్గాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. అసంబద్ధంగా నిరసన కార్యక్రమాన్ని పెట్టడం మొదటి తప్పయితే, దాన్ని రాద్ధాంతం చేస్తూ మరింత పెద్ద తప్పు చేస్తోంది టీడీపీ. ఓవైపు అధినేత, రౌడీ ప్రభుత్వం అంటూ అభాండాలు వేస్తుంటే, మరోవైపు దానికి వంతపాడుతూ టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు.

వీరికి కావాల్సింది ప్రజా సంక్షేమం కాదు, అరెస్ట్ లతో హడావిడి చేయడం. ఇటీవల టీడీపీ నేతల అరెస్ట్ ల వెనక ప్రధాన ఉద్దేశం ఇదే అని తెలుస్తోంది. ఇలా సింపతీకోసం అరెస్ట్ ల బాట పడుతున్నారు టీడీపీ నేతలు. అక్రమాలు చేసి ఓవైపు చింతమనేని వంటి నేతలు అరెస్ట్ అవుతుంటే.. వాటిని తక్కువ చేసి చూపేందుకు మిగతావారు కూడా ఇలా ఆందోళనలతో అరెస్ట్ అవుతున్నారు. మొత్తమ్మీద స్వాతంత్రానికి ముందు జైలుకెళ్లినోళ్లంతా స్వాతంత్ర సమరయోధులేనని రికార్డులున్నట్టు.. ఇప్పుడు అరెస్ట్ అవుతున్న టీడీపీ నేతలంతా.. నెపం వైసీపీపైకి నెట్టే ఆలోచనలో ఉన్నారు. 

పీవీపీ వర్సెస్ బండ్ల ఏది నిజం? ఏది అబద్దం?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?