Advertisement

Advertisement


Home > Politics - Gossip

పేదలకు స్థలాలిస్తున్నా కళ్లల్లో నిప్పులేనా?

పేదలకు స్థలాలిస్తున్నా కళ్లల్లో నిప్పులేనా?

అమ్మపెట్టదు అడుక్కు తిననివ్వదు. అన్న సామెతకు అప్ డేట్ వర్షన్ లాగా తెలుగుదేశం నాయకులు పెచ్చరిల్లుతున్నారు. వారు యివ్వరు.. మరెవ్వరైనా ఇస్తున్నా కూడా సైంధవుల్లాగా అడ్డం పడతారు. ప్రక్రియ ఆగిపోయేలా చేస్తారు... ప్రజలు అవస్థలు పడినా సరే.. వారికి ఖాతరు లేదు. పేదలకు ఇంటిస్థలాలు పంచే విషయంలో ప్రభుత్వ నిశ్చయాన్ని ప్రభావితం చేయడానికి, ఆపివేయించడానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఉగాది నాడు పేదలకు ఇంటిస్థలాలు పంపిణీ చేయనున్నట్లుగా చాలా కాలం కిందటే జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన కసరత్తు నెలల కిందటినుంచి జరుగుతోంది. ఇది కొత్తగా ప్రకటించిన పథకం కాదు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత తీసుకున్న నిర్ణయం కాదు. నోటిఫికేషన్ సందర్భంగా కూడా... ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలను కొత్తగా ప్రకటించరాదన్నది మాత్రమే నిబంధన. ఆ సమయంలో ఇంటిస్థలాల విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా.. తర్వాత నిర్ణయిస్తామని.. కోడ్ పరిధిలోకి వస్తుందో లేదో చూడవలసి ఉందని ఎన్నికల కమిషనర్ అన్నారు.

పంపిణీ సంగతి నిదానంగానే తేలుతుందని అనుకోవచ్చు. కానీ. ఇంటిస్థలాల పంపిణీ అనే ప్రక్రియకు సంబంధించి.. ఏర్పాట్లు కూడా ఎన్నికలు ముగిసేదాకా జరగనే కూడదు అంటే ఎలా? వివిధ ప్రాంతాల్లో ఎంపిక చేసిన స్థలాలను తీర్చి.. హద్దులు నిర్ణయించే పనులు జరుగుతోంటే.. అలాంటి పనులను కూడా పూర్తిగా ఆపివేయించాలంటూ.. తెలుగుదేశం దళాలు రగడ చేస్తున్నాయి. ఈ మేరకు వర్ల రామయ్య ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారు.

స్థలాలు హద్దులు నిర్ణయిస్తుండడమే పెద్ద మహాపరాధం జరిగిపోయినట్లుగా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం విశేషం. తెలుగుదేశం పార్టీ ఇంత ప్రజాకంటకంగా ప్రవర్తిస్తున్నది కాబట్టే.. వారిని ప్రజలు దారుణంగా తిరస్కరించి.. ఇంటికే పరిమితం చేశారని ప్రజలు అనుకుంటున్నారు. తెదేపా హయాంలో ఈ తరహాలో ప్రజల సుస్థిర సంక్షేమం గురించి పట్టించుకోనేలేదు. వైకాపా సర్కారు వచ్చాక వారు శ్రద్ధగా చేపడుతున్న పథకాలను కూడా అడ్డుకోడానికి తెదేపా ప్రయత్నిస్తున్నదనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.

పరిశ్రమ పరువు తీసేది కాదు, పరువు పెంచేది ఈ సినిమా

వీడు మా అమ్మ నాన్న కంటే బాగా చూసుకున్నాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?