కాంగ్రెస్‌కు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్?

జమ్మూకాశ్మీర్లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు లేవన్నది సుస్పష్టం. 370 అధికారణాన్ని సమర్ధించేవాళ్లు, దాని నిషేధాన్ని సమర్థించేవాళ్ళు అందరూ కూడా అక్కడ అ పరిస్థితులు సవ్యంగా లేవనే విషయాన్ని తప్పకుండా ఒప్పుకుంటారు. ఇలాంటి సమయంలో బాధ్యతగల…

జమ్మూకాశ్మీర్లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు లేవన్నది సుస్పష్టం. 370 అధికారణాన్ని సమర్ధించేవాళ్లు, దాని నిషేధాన్ని సమర్థించేవాళ్ళు అందరూ కూడా అక్కడ అ పరిస్థితులు సవ్యంగా లేవనే విషయాన్ని తప్పకుండా ఒప్పుకుంటారు. ఇలాంటి సమయంలో బాధ్యతగల నాయకులు ఎవరైనా సరే అక్కడి వాతావరణం మరింతగా దెబ్బతినకుండా ప్రవర్తించాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించడం- విభేదించడం వేరే సంగతి! కానీ కాశ్మీరు సమాజం పట్ల, శాంతియుతవాతావరణం పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించకూడదు.

కానీ కాంగ్రెస్ పార్టీ పైన చెప్పుకున్న నైతిక విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని అనిపిస్తోంది. కాశ్మీరులో ఉద్రిక్తతలు రేగేలా చేస్తున్నదేమో అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. అసలే అక్కడ అ పోలీసు మిలిటరీ పహారా మధ్య ప్రజాజీవనం ఉన్న ప్రస్తుత సమయంలో ప్రజలను పరామర్శించే పేరిట సమావేశాలు పెట్టడానికి అంటూ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ అక్కడికి వెళ్లడం వివాదాస్పదంగా కనిపిస్తోంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తున్న 370 అధికరణం రద్దు అంశంపై… అడ్డగోలుగా మాట్లాడడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కొంత వ్యతిరేకతను మూటగట్టుకుంది. రాజకీయ పరంగా చూసినా కూడా ఇది వారికి చాలానష్టం. వారి ప్రాబల్యం పుష్కలంగా ఉన్న దాఖలాలు కూడా లేని- చిన్న ప్రాంతం జమ్మూ కాశ్మీర్ కోసం, వారు దేశంలోని చాలామంది దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకున్నారు. గులాంనబీ ఆజాద్ రాజ్యసభ ప్రసంగం కూడా కాంగ్రెసుకు నష్టం చేసిందనే విశ్లేషణలు వస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్న సున్నిత పరిస్థితులను ఉద్రిక్తతలు రేగగల అవకాశాలను పరిగణనలోకి తీసుకోకుండా గులాంనబీ ఆజాద్ పరామర్శ పేరిట బాధలో ఉన్న ప్రజలతో సమావేశాల పేరిట అక్కడకు వెళ్లిపోవడం అనేది దురాగతం కింద లెక్కవేయాలి. అందుకే గులాంనబీ ఆజాద్ శ్రీనగర్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టగానే పోలీసులు అక్కడే అడ్డగించారు. అటు నుంచి అటే తిరిగి ఢిల్లీ పంపించారు.

370 రద్దు నిర్ణయం పట్ల అక్కడ కొందరిలో వ్యతిరేకత నిజంగానే ఉండవచ్చుగాక… వారందరూ కాంగ్రెస్ పార్టీ అనుకూలురు కావచ్చుగాక… వారిని పరామర్శించడం తన విధి అని, రాజకీయ అవసరం అని ఆజాద్ అనుకోవచ్చు గాక! దానికి పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న ఈ సమయాన్ని ఎంచుకోవడం మాత్రం బాధ్యత లేని విషయం!

నాయకులు ప్రజల ఓట్లతో అధికార పీఠాలు అలంకరించడం మాత్రమేకాదు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. తమవలన చేటులేకుండా రాజకీయ వ్యతిరేకతను తెలియజెప్పే మార్గాలను ఎంచుకుంటే గౌరవం నిలుపుకోగలుగుతారు.

అధికారంతో వైఎస్సార్సీపీ, ఆరాటంతో బీజేపీ