Advertisement

Advertisement


Home > Politics - Gossip

వంశీపై వేటు పడకుంటే.. తెదేపాకు చావుదెబ్బే!

వంశీపై వేటు పడకుంటే.. తెదేపాకు చావుదెబ్బే!

ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఆయన మీద స్పీకరుకు తెదేపా ఇంకా ఫిర్యాదు చేయలేదు. పార్టీ సస్పెండ్ చేసింది గనుక.. ఆయన ప్రస్తుతానికి స్వతంత్ర ఎమ్మెల్యే. సాంకేతికంగా ఇలాంటి నేపథ్యంలో.. ఎమ్మెల్యే వంశీ మీద స్పీకరు అనర్హత వేటు వేస్తారా? లేదా? అనేదాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నదంటే అతిశయోక్తి కాదు.

వంశీ తెలుగుదేశం నుంచి సస్పెండ్ అయిన స్వతంత్ర ఎమ్మెల్యే మాత్రమే కావొచ్చు గానీ.. ఆయన వైకాపాతో జట్టు కట్టినట్టే. అధికారికంగా సభ్యత్వం మాత్రం తీసుకోలేదు. ఆయనను వైకాపా నాయకుడిగానే పరిగణిస్తున్నారు. కానీ.. ఫిరాయింపు చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయడానికి సరిపడా ఆధారాలు మాత్రం లేవు. అదే తెదేపాకు ఉన్న పితలాటకం.

తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోవడానికి మానసికంగా సిద్ధమైపోయి ఉన్నారు. అలాంటి వారంతా.. కేవలం ఫిరాయిస్తే అనర్హత వేటు పడుతుందనే భయంతోనే ఆగుతున్నారు.

మరోవైపు ... తాను కనీస విలువలు పాటించాలని అనుకుంటున్న జగన్.. రాదలచుకున్న వారు.. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన తర్వాత మాత్రమే రావాలని గట్టిగా చెబుతున్నారు. అందువల్లనే.. వంశీ అధికారికంగా చేరడం కూడా ఇంకా జరగలేదు.

ఇలాంటి నేపథ్యంలో రాజీనామా చేయకుండా, వైకాపాలో చేరకుండా.. తెదేపా పార్టీకి మాత్రం రాజీనామా చేస్తే.. వారు స్వతంత్ర సభ్యులుగా అయ్యే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ అండదండలు కూడా పొందవచ్చు. వారితో మమేకం కావొచ్చు. ఇలాంటి వెసులుబాటు దక్కుతుందా? లేదా? స్పీకరు ఈ పరిణామాల్ని ఎలా పరిగణిస్తారు? అనేది వంశీ ఎపిసోడ్ తో తేలుతుంది.

రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వంశీ స్వతంత్రంగా ఉంటారా? ఏపార్టీకైనా అనుబంధ సభ్యుడు అవుతారా? అనేది ఆయన ఇష్టం అని స్పీకరు తమ్మినేని అంటున్నారు. వంశీ సభలో ఎలా ఉంటారో తేలి, దానివల్ల అనర్హత వేటు పడే అవకాశం లేదని అర్థమైతే గనుక.. ఇంకా అనేకమంది నాయకులు.. క్యూ కట్టి మరీ.. తెలుగుదేశంనుంచి ఇతర పార్టీల్లోకి ఫిరాయించే అవకాశం ఉందని పలువురు అంటన్నారు. అలా జరిగితే... తెలుగుదేశానికి అది చావుదెబ్బే అవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?