జబర్దస్త్ రగడ.. వాళ్లిద్దరికీ ఇంకా టైమ్ ఉంది

జబర్దస్త్ రచ్చ పీక్స్ కు చేరింది. నాగబాబుతో పాటు చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ ఇప్పటికే పార్టీ మార్చేశారు. జబర్దస్త్ ను వీడి జీ తెలుగు చెంతకు చేరారు. వీళ్లతో జీ తెలుగు కొత్త…

జబర్దస్త్ రచ్చ పీక్స్ కు చేరింది. నాగబాబుతో పాటు చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ ఇప్పటికే పార్టీ మార్చేశారు. జబర్దస్త్ ను వీడి జీ తెలుగు చెంతకు చేరారు. వీళ్లతో జీ తెలుగు కొత్త ప్రోమోలు రిలీజ్ చేసింది. అటు జబర్దస్త్ కూడా తమ కొత్త జట్లతో జబర్దస్త్ కొత్త ప్రోమో రిలీజ్ చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనసూయ, హైపర్ ఆదిలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

జీ తెలుగు కొత్త ప్రోమోల్లో అనసూయ కనిపిస్తోంది. లోకల్ గ్యాంగ్స్ అనే సరికొత్త కార్యక్రమంలో అనసూయ చిందులేసింది. అంతేకాదు, ఆ ప్రొగ్రామ్ కు శేఖర్ మాస్టర్ తో కలిసి జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. దీంతో జబర్దస్త్ లో అనసూయ ఇక కనిపించదని గాసిప్స్ మొదలయ్యాయి. దీనిపై అనసూయ క్లారిటీ ఇచ్చింది.

జబర్దస్త్ అనసూయగానే నేను బాగున్నానని, నా నుంచి క్లారిటీ వచ్చేంతవరకు పుకార్లు నమ్మొద్దని ప్రకటించింది అనసూయ.  తనకు కోపం వచ్చేలా రెచ్చగొట్టొద్దని, సంయమనంతోనే సమాధానాలిస్తానని కూడా చెప్పుకొచ్చింది. మరోవైపు హైపర్ ఆది కూడా ఇదే తరహాలో స్పందించాడు. తానింకా జబర్దస్త్ లోనే ఉన్నానని, రాబోయే రోజుల్లో తను ఎక్కడుంటానో, ఏం చేస్తానో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడని చెబుతున్నాడు.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. జీ తెలుగుకు అనసూయ కొత్త కాదు. ఆమెకు అక్కడ ఆల్రెడీ ఓ రేటు ఫిక్స్ అయింది. ఇప్పుడు నాగబాబు బ్యాచ్ తో కలిపి కొత్తగా ఎక్స్ ట్రా పారితోషికం అడుగుతోంది అనసూయ. అదింకా తెగలేదు. అందుకే ఆమె ఎంట్రీ పూర్తిస్థాయిలో జరగలేదు. ఇక హైపర్ ఆది విషయానికొస్తే.. ఈయన వ్యవహారం వేరుగా ఉంది.

హైపర్ ఆదికి జంప్ కొట్టాలని ఉంది. ఆయన దానికి మానసికంగా కూడా సద్ధపడి ఉన్నారు. పైగా మెగా కాంపౌండ్ కు, మరీ ముఖ్యంగా నాగబాబుకు వీరవిధేయుడైన హైపర్ ఆది, అతడ్ని వదిలి ఉండలేడు. దీనికి తోడు జబర్దస్త్ ను వీడాలనే హైపర్ ఆది నిర్ణయాన్ని అతడి టీమ్ లోని కొంతమంది సభ్యులు వ్యతిరేకిస్తున్నారు.

సో.. ప్రస్తుతానికైతే హైపర్ ఆది, అనసూయ జబర్దస్త్ ను వీడడానికి ఇంకా టైమ్ ఉంది. అప్పటివరకు హైపర్ ఆది జబర్దస్త్ లోనే కొనసాగుతాడు, అటు అనసూయ జబర్దస్త్ తో పాటు లోకల్ గ్యాంగ్స్ లో కూడా మెరుస్తుంది.