ఆంధ్రలో ఇంగ్లీష్ మీడియం అంటే మన నేతలు అంతా అంత ఎత్తున లేచారు. తెలుగును చంపేస్తున్నారు జగన్, తెలుగునే తినాలి. తెలుగునే తాగాలి..అంటూ హడావుడి చేసారు.
పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువులు చెప్పిస్తా అంటే టాట్ వీల్లేదు. ముందు కొన్ని క్లాసుల వరకు తెలుగులోనే అంటూ నానా యాగీ జరిగిపోయింది. సరే కాస్త ఖర్చు చేయగలిగిన ఏ తల్లి తండ్రులు అయినా పిల్లలను నర్సరీ నుంచి ఇంగ్లీష్ లోనే చేర్పిస్తున్న సంగతి తెలిసిందే.
సర్కారీ బళ్లలోనే ఇలా ఇంగ్లీష్ చెప్పేస్తే కార్పొరేట్ స్కూళ్లు ఏమైపోవాలి. అందుకే అందరూ ఒక్కటై అడ్డం పడ్డారు. కానీ నేతల పిల్లలకు మంచి చదువులు కావాలి కదా? అందుకే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కూడా తన పిల్లలను విదేశీ బడుల్లో చేర్చే ప్రయత్నాల్లో వున్నారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
పవన్ సతీమణి గత కొన్ని నెలలుగా రష్యాలోనే వుంటున్నారని తెలుస్తోంది. ఆమె తమ పిల్లలను సింగపూర్ లేదా మరో చోట చదివించే ఆలోచనలో వున్నారని, అందుకే కొంతకాలంగా అక్కడే వుంటున్నారని తెలుస్తోంది. పిల్లలను సింగపూర్ లేదా మరో దేశంలో చదివించేందుకు వీలుగా ఆమె కూడా వారితోనే వుంటారని వినిపిస్తోంది.
సరే, ఆమె పిల్లలతో వుంటారా? పవన్ తో వుంటారా? అన్నది వారి వ్యక్తిగతం కానీ వారి పిల్లలకు మాంచి విదేశీ విద్య కావాలి. ఆంధ్ర పేద పిల్లలు మాత్రం తెలుగులోనే చదువుకోవాలి. ఇదెక్కడి న్యాయం.