cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

వైరల్: టీడీపీ రిపోర్టర్లకు అమరావతిలో ప్లాట్లు

వైరల్: టీడీపీ రిపోర్టర్లకు అమరావతిలో ప్లాట్లు

"పైకి బీసీల పార్టీలా బిల్డప్ ఇచ్చే పచ్చ పార్టీలో ఇన్నాళ్లు కొమ్ము కాసే కమ్మని‌వారికి‌ మాత్రమే ఒక్కొక్కరికి 75 లక్షల విలువచేసే ఫ్లాట్ ఇచ్చి వారిని తమ ఇంట్లోనే సిండికేట్ బ్యాంకు గుర్తుల్లాగా కట్టేసుకున్నాడు చినబాబు. 23 సీట్లతో చచ్చిపోయిందనుకున్న పచ్చ పార్టీ కి ప్రతి రోజు ఆక్సిజన్ ఇచ్చేందుకు ఇంట్లో కట్టేసుకున్న ఈ ప్లాట్ ఓనర్స్ తో డైలీ కవరేజ్ ప్లానింగ్ చేసుకుంది పచ్చ పార్టీ."

ఇలా ప్రారంభమైన ఆ పోస్టులో ఛానెల్ వారీగా ఎవరికి ఎంతెంత స్థలాల్ని లోకేష్ అప్పనంగా ఇచ్చారో క్లియర్ గా ఉన్నాయి. ఈ పోస్టులో ఈటీవీ-2, టీవీ5, ఏబీఎన్, టీవీ9 ఛానెళ్ల రిపోర్టర్ల పేర్లతో పాటు, అందుకున్న భూముల వివరాలు.. వాళ్లు ఆ భూముల్ని ఏం చేశారనే అంశాల్ని కూడా పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఆ పోస్ట్ లో కొన్ని వాక్యాల్ని ఇక్కడ యథాతథంగా ఇస్తున్నాం

అదేంటి.. రిపోర్టర్లు న్యూస్ ఛానెల్స్ లో ఉంటారు లేదంటే పత్రికల్లో ఉంటారు. టీడీపీకి కూడా ప్రత్యేకంగా విలేకర్లు ఉంటారా?
ఇది చాలా అమాయకమైన ప్రశ్న. రిపోర్టర్ల వర్గమే ఉందక్కడ. బాబు ఏం చేసినా వీళ్లకు గొప్ప విషయమే. బాబు చెప్పిందే వేదం వీళ్లకు. అహర్నిశలు శ్రమించే ఇలాంటి రిపోర్టర్ల వర్గానికి, తను అధికారం కోల్పోయే ముందు చాలా ప్రయోజనాలు కల్పించారు చంద్రబాబు. ఈ మేరకు సాక్ష్యాలతో సహా ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ విలేఖరులకు అమరావతిలో ఒక్కొక్కరికి 75 లక్షల రూపాయల విలువైన ప్లాట్లు అనే హెడ్డింగ్ తో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ లో కొన్ని కల్పితాలు ఉన్నప్పటికీ.. 90శాతం నిజాలు ఉన్నాయి.

"తాడేపల్లిలో ప్రధాన ప్రాంతమైన ఓ లగ్జరీ ఏరియాలో ఇప్పుడు Etv కృష్ణ, Tv5రాకేష్, ABN రామారావు, Ntv రమేష్, 10tv రవిచంద్, tv9లో ఓ పెద్దతలకాయకు సొమ్ములు... ఈనాడు, జ్యోతిలో కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఎనిమిది మంది రిపోర్టర్ లలో ఐదుమందికి ఒక్కొక్కరికి 75 లక్షల విలువున్న ఫ్లాట్ ఇచ్చేయడంతో వారు ఇప్పటికే గృహప్రవేశాలు కూడా చేసేసారు. అయితే తెలివి మీరిన ఇద్దరు రిపోర్టర్ లు వీరిలో ఒకరు ప్రతిక్షణం తమ జాతి హితం కోసం‌ ప్రత్యక్ష ప్రసారాలు చేసే రిపోర్టర్ మాత్రం 75 లక్షల రూపాయలు క్యాష్ తీసుకుని ఖమ్మం‌లో భూములు కొన్నాడు. ఇంకో దమ్మున్న చానెల్ రిపోర్టర్ అంతే సొమ్ముతో గుంటూరులో భూములు కొనుగోలు చేసాడు".

మెరుగైన సమాజం అంటూ ఊదరగొట్టే ఓ ఛానెల్ లో గతంలో పనిచేసి, ప్రస్తుతం చినబాబుకి ప్రత్యేక అధికారిగా వున్న మాజీ రిపోర్టర్ ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టడంలో కీలకపాత్ర పోషించాడని ఆ పోస్ట్ చెప్పుకొచ్చింది. ఇలా ఒక వర్గానికే చినబాబు స్పెషల్ గిఫ్టులు ఇవ్వడం, వాళ్లంతా దర్జాగా తమ హంగు-ఆర్భాటాన్ని ప్రదర్శించడంతో మిగతా జర్నలిస్టులంతా చెవులు కొరుక్కుంటున్నారు. అలా చెవులు కొరుక్కునే బ్యాచ్ నుంచే ఈ వివరాలన్నీ ఇలా పోస్ట్ రూపంలో బహిర్గతమయ్యాయి. 

సైరా ట్రైలర్ క్రేజ్ ఏ రేంజ్ అంటే.. చూసి తీరాల్సిందే..!