Advertisement

Advertisement


Home > Politics - Gossip

విశాఖ కు ఎంవివి గుడ్ బై?

విశాఖ కు ఎంవివి గుడ్ బై?

హ్యాపీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే ఎంవివి సత్యనారాయణ పగ, పట్టుదలతో రాజకీయాల్లోకి వచ్చారు. విశాఖ నుంచి పార్లమెంట్ గు ఎన్నికయ్యారు. మూడున్నరేళ్లు గడిచేసరికి తత్వం బోధపడింది. 

వ్యాపారమే సులువు రాజకీయం కన్నా అని. ప్రతి పక్షాల నుంచి స్వపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. కేవలం వ్యాపారమే చేసినపుడు ఎన్ని ఎత్తుగడలు వేసి, ఎలా సాగించినా నడిచిపోయింది. ఎవరూ వేలెత్తి చూపించలేదు. కానీ ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నా దానికి రాజకీయం రంగు అంటుకుంటోంది.

దీంతో ఎంవివి చాలా ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇక విళాఖలో వ్యాపారాలకు స్వస్తి చెప్పాలని అనుకుంటున్నట్లు బోగట్టా. ఇప్పుడు చేతిలో వున్న ప్రాజెక్టులు అన్నీ ఫినిష్ చేసేయాలని, కొత్త ప్రాజెక్టులు విళాఖలో టేకప్ చేయకూడదని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

తన వ్యాపారాలు అన్నీ హైదరాబాద్ కు షిప్ట్ చేసే ప్రయత్నాల్లో ఎంవివి వున్నారట. మాదాపూర్, బాచుపల్లి ప్రాంతాల్లో ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గమ్మత్తేమింటే వైకాపా ఎంపీ విజయసాయితో ఎంవివి కి పొసగలేదు. విజయసాయి అల్లుడు హైదరాబాద్ నుంచి విశాఖలో రియల్ ఎస్టేట్ కోసం అడుగుపెట్టి భూములు కొన్నారు. ఈ వైనం వెనుక ఎంవివి వున్నారని విజయసాయి అనుమానం. అందుకే ఎంవివి మీద ధ్వజమెత్తారు.

ఇదిలా వుంటే ఎంవివి..విజయసాయిలు ఇద్దరినీ కూర్చుని, మాట్లాడుకుని విబేధాలు పరిష్కరించుకోమని సిఎమ్ జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరి ఇంతకీ మరోసారి విశాఖ నుంచి ఎంవివి పోటీ చేసే ఆలోచనలో వున్నారా అన్నది కూడా అనుమానంగా వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?