Advertisement

Advertisement


Home > Politics - Gossip

విశాఖలో ఆఖరి అస్త్రం అదేనా?

విశాఖలో ఆఖరి అస్త్రం అదేనా?

విశాఖను వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ పరంగా గుప్పిట్లో వుంచుకున్న సామాజిక వర్గం గత ఏడాది కాలంగా కలవరపడుతోంది. తమ హవా ఇక చెల్లడం లేదని కిందా మీదా అవుతోంది. ఇదే సమయంలో పాలనా రాజధాని కనుక విశాఖ కు వస్తే, అన్ని తరహా జనాలు వచ్చి, విశాఖలో తమ పని పలుచన అవుతుందని ఆ వర్గం భావిస్తోంది. కానీ అలా అని రాజధానికి ఆపలేకపోతోంది. మరో పక్క వైకాపా నేత విజయసాయిరెడ్డి హవా నడుస్తోంది. ఇది మరీ ఇబ్బందిగా వుంది.

ఇక అన్ని విధాలా ఏదీ సాధ్యం కాదు కనుక, వైకాపాలోకి దూరి తమ హవా నిలబెట్టుకోవడం ఒక్కటే ఆఖరి అస్త్రంగా ఈ వర్గం భావిస్తోంది.  కానీ ఈ వర్గానికి వైకాపాలో నేరుగా నో ఎంట్రీ. పైగా ఎంట్రీ వున్నా ప్రాధాన్యత వుండదు. అందుకే తెలుగుదేశం నేత గంటా శ్రీనివాసరావు ద్వారా పని కానిచ్చుకోవాలని చూస్తున్నట్లు బోగట్టా.

గంటా శ్రీనివాసరావు కాపు అయినా కూడా ఆ సామాజిక వర్గంతో కూడా గట్టి భవబంధాలు వున్నాయి. ఆయన వారికి కూడా బ్రహ్మాండంగా పనులు చేసి పెడతారని పేరు వుంది. అందువల్ల గంటాను వైకాపాలోకి పంపి, ఆయన ద్వారా విశాఖలో తమ హవా మళ్లీ నిలబెట్టుకోవాలని ఆ సామాజిక వర్గం ఆఖరి ట్రంప్ కార్డు విసురుతున్నట్లు బోగట్టా. 

గంటా పార్టీలోకి రావడం విజయసాయికి, అవంతి శ్రీనివాస్ కు ఇష్టం లేకపోయినా, వైకాపాకే చెందిన ఉత్తరాంధ్ర నాయకుడు ఒకరు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గంటా వస్తే విజయసాయి ని పక్కకు తప్పించవచ్చని ఆ నాయకుడి ఆలోచనగా వుంది. 

మొత్తానికి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే విశాఖలోని కీలక సామాజిక వర్గం, వైకాపాలోనే ఓ కీలకనేత కలిసి, గంటాను వైకాపాలోకి తోసేందుకు, తీసుకువచ్చేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు బోగట్టా. విశాఖ కార్పొరేషన్ మేయర్ పదవిని గెలిపించి ఇస్తాననే వాగ్దానంతో గంటా పార్టీలోకి ఎంటర్ అవుతారని, అలా అయితే జగన్ కూడ నో అనలేరని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

నేను ఎప్పటికీ పవన్ భక్తుడినే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?