Advertisement

Advertisement


Home > Politics - Gossip

విశాఖలో భూకుంభకోణాలే కీలకం

విశాఖలో భూకుంభకోణాలే కీలకం

విశాఖ కు వైకాపా నేత విజయసాయి రెడ్డికి మాంచి సంబంధం వుంది. గత అయిదేళ్లుగా పార్టీ నిర్మాణం మీద విజయసాయి తన దృష్టి అంతా విశాఖ మీదే పెట్టారు. అది  పూర్తయింది. ఇప్పుడు విశాఖను శాసన రాజధానిగా చేయాలనే ప్రయత్నం మొదలైంది. ఈ వ్యవహారానికి బ్రేక్ వేయాలని ఎవరి ప్రయత్నాలు, ఎవరికి వారు తలో రకంగా చేస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో తెరవెనుక మరో అధికారిక కార్యక్రమం ప్రారంభమైందని బోగట్టా. గత అయిదేళ్లుగా వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిపోయినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రెవెన్యూ అధికారుల నుంచి ఆనుపానులు సంపాదించి, ఒక సామాజిక వర్గానికి చెందిన ఎక్కడిపడితే అక్కడ ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ భూములు తమ చేతుల్లోకి తీసుకున్నారని తెలుస్తోంది. సిటీ పరిథిలో కూడా ఇలాంటి ఆక్రమణలు వున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

ఓ బడా పారిశ్రామిక వేత్త కాలువలు ఆక్రమించి అయిదు అంతస్తుల బిల్డింగ్ కట్టేసినట్లు, ఈయన తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. అలాగే తెలుగుదేశం పార్టీతో అనుబంధం వున్న ఓ బిల్డర్ కట్టిన పలు ప్రాజెక్టుల్లో అవకతవకలు కూడా వున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో, విజయనగరం జిల్లాలో అటవీ బోర్డరులో ఇలాంటి వ్యవహారాలు వున్నాయని తెలుస్తోంది. 

అలాగే బి ఫారం పట్టా భూములు అనేకం చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇప్పడు వీటన్నింటి తీగ లాగుతున్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటుకు అవసరమైన స్థలాలు ఈ విధంగా అన్యాక్రాంతం అయిపోయిన వాటిని వెనక్కు రప్పించడం ద్వారా సమకూర్చుకోవాలన్నది ప్లాన్. ఇది ఇప్పుడు తెలుగుదేశం వర్గాలకు మింగుడు పడడం లేదు. ఈ వ్యవహారం మొత్తానికి అడ్డుకట్ట పడాలి అంటే విజయసాయి విశాఖను వీడిపోవాలి. లేదా విజయసాయి ప్రాధాన్యత వైకాపాలో తగ్గాలి.

అందుకే ఇప్పుడు రఘరామకృష్ణం రాజును విజయసాయి మీదకు ప్రయోగించారు. ఉత్తరాంధ్రలో క్షత్రియులు విజయనగరం వ్యవహారం మీద గరం గరంగా వున్నారు. కేవిపితో సామాజిక బంధం వున్న సబ్బం హరి, అయ్యన్నపాత్రుడు లాంటి వారు వుండనే వున్నారు. తెలుగుదేశం సామాజిక వర్గం వుండనే వుంది. వీళ్లందరికీ ఎవరికి కావాల్సిన భయాలు వారికి వున్నాయి.

అయ్యన్నకు సంబంధించిన రిసార్టును గతంలో భోగాపురం ఎయిర్ పోర్టులోకి లాగాలని అప్పటి మంత్రి గంటా ప్రయత్నించారు. కానీ బాబు దానిని అడ్డుకున్నారు. ఇప్పుడు జగన్ మళ్లీ అదేపని చేస్తారేమో అన్న భయం అయ్యన్నకు ఉంది. అంతే కాదు, వందలాది ఎకరాలు వున్న ఆసాములు ప్రభుత్వ కార్యకలాపాల కోసం ఎక్కడ ప్రభుత్వం ఎక్వయిర్ చేస్తుందో అన్న భయంతో వున్నారు. 

ఇలా అందరూ కలిసి ఇప్పుడు విజయసాయిని ముందుగా విశాఖ నుంచి సాగనంపాలనే ప్రయత్నంలో భాగమే ఆయనపై బురద జల్లడం, ఆయనను టార్గెట్ చేయడం అని తెలుస్తోంది. ఈ ప్రయత్నాలకు జగన్ ఎంత వరకు తలొగ్గుతారో చూడాలి.

అల.. వైకుంఠపురంలో చూసి మైండ్ పోయింది

పీకే ఓడిపోయింది మాఊరి నుంచే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?