విశాఖ నుంచి విజయనగరం యాభై కిలోమీటర్లు, విజయనగరం నుంచి శ్రీకాకుళం మరో యాభై కిలోమీటర్లు. ఈ మూడింటికి కలిపి మూడు విమానాశ్రయాలు అని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ప్రకటిస్తే తప్పు కాలేదు.
అమరావతిని రాజధానిగా ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందు, మిగిలిన ప్రాంతాల వారిని మబ్బులో వుంచి, మభ్యపెట్టడం కోసం చంద్రబాబు చేసిన సుదీర్ఘ హామీల ప్రకటన ఒకటి వుంది. బాబుగారి అనుకుల మీడియా దానిని చాలా కన్వీనియెంట్ గా మరిచిపోయినట్లు నటిస్తే నటించవచ్చు.
కానీ ఆనాడు ప్రచురించిన జాబితా వుండనే వుంది. ప్రతి జిల్లాకు ఓ ఎయిర్ పోర్టు అని ఆనాడు బాబుగారు కూడా హామీ కాదీ ప్రకటనే చేసారు అసెంబ్లీలో. ఆయన స్వంత నియోజకవర్గం కుప్పం లో ఎయిర్ పోర్ట్ అన్నారు. కనీసం దానిని కూడా టేకప్ చేయలేకపోయారు.
ప్రతి జిల్లాకు పారిశ్రామిక కారిడార్, టెక్స్ టైల్ పార్కులు, ఫుడ్ పార్కులు ఇలా ఒకటేమిటి ఎన్ని ప్రకటనలో ఆ రోజు చేసినవి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా పట్టించుకోలేదు. అమరావతి తప్ప. కేవలం మిగిలిన ప్రాంతాల ప్రజలు ఫీల్ కాకుండా వుండడం కోసం చేసిన ప్రకటన తప్ప వేరు కాదని జనాలకు ఎక్కడ అర్థం అవుతుందో అని ఆ ప్రకటనను కన్వీనెయెంట్ గా మరిచిపోయారు బాబుగారు. ఆయన అనునాయులు, ఆయన మీడియా.
ఆ సంగతి తెలియక పాపం అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్లు కూడా జగన్ ఏదో తప్పు చేసాడు, గాలి హామీలు ఇచ్చాడు అంటూ నానా యాగీ చేస్తున్నారు. జగన్ ను ఆసుపత్రిలో చూపించాల్సి వస్తే అంతకన్నా ముందుగా బాబుగారిని కదా చూపించాల్సింది. ఏమంటారు అయ్యన్నా? ఊ అంటారా? ఊఊ అంటారా?