గవర్నర్‌తో పితూరీ చెబితే ఏమౌతుంది?

శాసనసభ నిబంధనల్లో ఉండే కొన్ని అప్రధానమైన లొసుగుల్ని వాడుకుని.. ఒకరకమైన పరిపాలన సంక్షోభానికి తెరలేపింది ఆయనే. తాను చూపించిన బాటలోనే.. ఇతరులు కూడా నడవడంతో.. నిబంధనల్లోని లోటుపాట్లు లొసుగులను ఆశ్రయించి ఆడుకుంటుండడంతో.. ఏం చేయాలో…

శాసనసభ నిబంధనల్లో ఉండే కొన్ని అప్రధానమైన లొసుగుల్ని వాడుకుని.. ఒకరకమైన పరిపాలన సంక్షోభానికి తెరలేపింది ఆయనే. తాను చూపించిన బాటలోనే.. ఇతరులు కూడా నడవడంతో.. నిబంధనల్లోని లోటుపాట్లు లొసుగులను ఆశ్రయించి ఆడుకుంటుండడంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయారు. ఏ ఆదేశాలు జారీచేయాల్సి వచ్చినా సరే.. వాటిని అమల్లో పెట్టవలసినది ఎవరు? ఏ ప్రభుత్వ యంత్రాంగం మద్దతు లేకుండా.. తన ఆదేశాలు, పదవి, హోదా అన్నీ నిష్ఫలం అవుతాయో.. అలాంటి ప్రభుత్వంతోనే ఆయన సున్నం పెట్టుకున్నారు. అందుకే ఇక వేరే మార్గాంతరం గోచరించక గవర్నరు వద్దకు వెళ్లి మొర పెట్టుకుంటున్నారు. అవును ఇంతకూ గవర్నరుకు పితూరీ చెబితే ఏమౌతుంది?

అవును, ఇదంతా శాసనమండలికి సంబంధించిన వ్యవహారమే. అధికార వికేంద్రీకరణ బిల్లును శాసనసభ ఆమోదించిన అనంతరం, ప్రభుత్వం మండలికి పంపితే.. ఛైర్మన్ వ్యవహార సరళి కొత్త సంక్షోభానికి తెరలేపిన సంగతి తెలిసిందే. కొన్ని నిబంధనల్ని ఆసరాగా చేసుకుని… బిల్లును చర్చకు అనుమతించడానికి ముందే.. ‘తన విచక్షణాధికారం మేరకు’ శాసనమండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి నివేదించారు. ఆయనైతే సెలక్ట్ కమిటీలను పురమాయించారు గానీ.. శాసనసభ కార్యదర్శి ఆ ఆదేశాలను తిప్పికొట్టడంతో చిన్న సంక్షోభం ఏర్పడింది. నిబంధనల ప్రకారం.. సెలక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని.. అసెంబ్లీ కార్యదర్శి తన లేఖలో తేల్చేశారు.

మండలి ఛైర్మన్ చర్య తీసుకోవచ్చు.. అనేది తెదేపా నేతల మాట! ఏం చర్య తీసుకుంటారు? ఎవరిపై చర్య తీసుకుంటారు? ఆయన శిక్ష విధిస్తే దానిని అమలు చేయాల్సింది ఎవరు? వారిని ఎంత వరకు సహకారం ఉంటుంది? ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఈ నేపథ్యంలో షరీఫ్ , మంగళవారం నాడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో  భేటీ అయ్యారు. ఖచ్చితంగా తన ఆదేశాలను అమలు చేయకపోవడం గురించి చెబుతారు. మరి పర్యవసానం ఏమవుతుంది? గవర్నరు వైపు నుంచి ఏదో  ఒక నిర్ణయం ముందుగా వస్తుందా? లేదా, శాసనమండలిని రద్దుచేసిన అసెంబ్లీ తీర్మానం ముందుగా పార్లమెంటు ఆమోదం పొందుతుందా? వేచిచూడాలి.

రష్మికని దారుణంగా ఆడేసుకున్నారు