వైకాపాకు అధికారం పవన్ భిక్షేనట!

జనసేన పార్టీ నాయకులు తాజాగా ఓ అద్భుతమైన సంగతిని బయటపెట్టారు. ఆ సంగతిని వారు ఇప్పుడే కనుగొన్నట్టుగా ఉంది. వెంటనే ప్రజలకు చెప్పేయకపోతే.. మళ్లీ తామే మర్చిపోతామేమో అన్నట్లుగా.. మీడియాద్వారా ప్రజలకు వెల్లడించేశారు. Advertisement…

జనసేన పార్టీ నాయకులు తాజాగా ఓ అద్భుతమైన సంగతిని బయటపెట్టారు. ఆ సంగతిని వారు ఇప్పుడే కనుగొన్నట్టుగా ఉంది. వెంటనే ప్రజలకు చెప్పేయకపోతే.. మళ్లీ తామే మర్చిపోతామేమో అన్నట్లుగా.. మీడియాద్వారా ప్రజలకు వెల్లడించేశారు.

ఇంతకూ వారు చెబుతున్నదేంటో తెలుసా.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ ఆ పదవి దక్కడం అనేది పవన్ కల్యాణ్ పెట్టిన భిక్షేనట! వారి భిక్షతోనే ఇప్పుడు జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా పాలన చేస్తున్నాడంటూ పరోక్షంగా వెల్లడించారు.

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్, అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ మీడియా మీట్ లో ఈ సంచలన సత్యాల్ని వెల్లడించారు.ఇంతటి దారుణమైన సత్యాన్ని ఇంతకూ వారెలా కనుక్కోగలిగారు. అంతటి జ్ఞానం వారికి ఎలా కలిగింది? అనే సందేహం ఎవ్వరికైనా కలగడం సహజం.

వారు 2014 ఎన్నికలతో వారు 2019 ఎన్నికలను పోల్చిచెబుతూ.. తాము కనుగొన్న సంగతులు బయటకు చెప్పారు. 2014లో మేం తెలుగుదేశానికి మద్దతిస్తే మీరు ఓడారు- 2019లో మద్దతివ్వకపోవడం వల్ల మాత్రమే మీరు గెలిచారు అంటూ వారు సెలవిస్తున్నారు.

ఆహా ఎంత గొప్ప సత్యం!2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి  49.9 శాతం ఓట్లు లభించాయి. అంటే ఇంచుమించు 50 శాతం. అంటే.. రాష్ట్రంలోని ప్రతి ఇద్దరిలో ఒకరు జగన్మోహన రెడ్డి సీఎం కావాలని కోరుకున్నారు. మరి మిగిలిన వారికి ఓట్లు ఎలా వచ్చాయి. తెలుగుదేశానికి దక్కింది… కేవలం 39.2 శాతం మాత్రమే.

ఏకంగా 12 శాతం ఓట్ల తేడా ఉంది. కాగా, 2014లో తెలుగుదేశాన్ని తామే అధికారంలోకి తెచ్చేశామని విర్రవీగుతున్న ఈ పార్టీ వారికి.. సొంతంగా రాష్ట్రమంతా పోటీచేస్తే.. స్వయంగా పార్టీ అధినేత రెండు చోట్ల బరిలోకి దిగితే.. దక్కినది మొత్తం… 6.78 శాతం ఓట్లు మాత్రమే. ఏకంగా తొలిసారే అధికారంలోకి వచ్చేస్తున్నాం అని బీరాలు పలుకుతూ బరిలోకి వచ్చిన పార్టీకి ఇంత తక్కువ ఓట్లు రావడం సిగ్గు చేటు.

ఇక పోగా.. ఇప్పుడు పవన్-భాజపా స్నేహం చూసి వైకాపా జడుసుకుంటున్నదని వారు అంటున్నారు. 6.78 శాతం వచ్చిన పార్టీ.. 0.84 శాతం ఓట్లు వచ్చిన పార్టీలు రెండూ ఒక్కటయ్యే సరికి.. 50 శాతం ఓట్లు వచ్చిన పార్టీకి వణుకు పుడుతున్నదిట.

కామెడీకి కూడా ఒక హద్దుండాలి. జనసేన నాయకులు మరీ సిగ్గు చేటు కామెడీని నడిపిస్తున్నారు.మీ  పదవులు మీకు జనసేన పార్టీ పెట్టిన భిక్ష అని చెప్పగలిగేంత అజ్ఞానం వారికి ఎలా సంప్రాప్తించిందో కదా.. అని ప్రజలు నివ్వెరపోతున్నారు.

నా పంచ ప్రాణాల్లో త్రివిక్రమ్ గారు ఒకరు