Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Gossip

పవన్ మాటల్ని ప్రజలెందుకు నమ్మాలి!

పవన్ మాటల్ని ప్రజలెందుకు నమ్మాలి!

ఒకవైపు రాష్ట్ర అసెంబ్లీ... పాలనను వికేంద్రీకరించి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించిన సమయంలోనే... జనసేనాని పవన్ కల్యాణ్ శకునాలు పలుకుతున్నారు. మూడు రాజధానులు మూణ్నాళ్ల ముచ్చటే అంటున్నారు. శాశ్వత పరిపాలన రాజధాని అనేది అమరావతిలో మాత్రమే ఏర్పాటు అవుతుందని పవన్ జోస్యం చెబుతున్నారు. కేంద్రంలోని భారతీయజనతా పార్టీతో మాట్లాడి, ఈ మూడు రాజధానుల వ్యవహారంపై భవిష్య కార్యచరణ ప్రకటిస్తానని కూడా హెచ్చరిస్తున్నారు. అమరావతిలో శాశ్వత రాజధాని అనేది జనసేన-భాజపా ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని కూడా ఆయన ఆశపడుతున్నారు.

ఇదంతా ఓకే. ఒక నాయకుడిగా ఆయన ఏమైనా చెప్పవచ్చు. కానీ ఆయన మాటలను ప్రజలు ఎందుకు నమ్మాలి? ఆయన చెబుతున్న మాటలు నిజం అవుతాయని, నిజం చేయగల సత్తా ఆయనకు గానీ, భారతీయ జనతా పార్టీకి గానీ ఉన్నదని ప్రజలు ఎలా విశ్వసించాలి? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది.

పవన్ చెబుతున్న మాటల్ని లోతుగా గమనిస్తే... అమరావతిలో శాశ్వత పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడం అనేది వారి కూటమికి మాత్రమే సాధ్యమవుతుంది. అంటే.. జనసేన-భాజపా అధికారంలోకి వస్తే అలా జరగుతుందని ఆయన చెబుతున్నారు. అది సాధ్యమయ్యే పనేనా? ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు కలిపి లభించిన ఓట్ల శాతం 7 మాత్రమే. ఇంత ఘోరమైన స్థితిలో ఉన్న ఆ పార్టీలు.. రాబోయే నాలుగేళ్లలో 40 శాతం ఓట్లు పొందేలాగా ప్రజల హృదయాల్ని గెలుచుకుని అధికారపీఠం మీదికి రావడం సాధ్యమయ్యేదేనా?

అది సాధ్యమౌతుందని ప్రజలు నమ్మగలరా? అందుకే పవన్ కల్యాణ్ మాటలు నమ్మడానికి వీల్లేకుండా ఉంది. ఆయనేదో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి భాజపాతో పొత్తు పెట్టుకుని ఉండవచ్చు గాక... పొత్తు కోసం ఊరేగిన పెద్దమనిషి.. కేంద్రం తమ బాధ్యతగా రాష్ట్రానికి ఇవ్వవలసిన ప్రత్యేకహోదా డిమాండ్ ను ఎందుకు పక్కన పెట్టేశారో చెప్పాలి. హోదా నేను మాత్రమే సాధిస్తానని గతంలో అన్నట్లే... ఇప్పుడు నేను మాత్రమే అమరావతిలో శాశ్వత రాజధానిని ఉంచుతానని ఆయన అంటున్నారు. ఆ మాట తుస్సుపోయినట్లే.. ఇది కూడా తుస్పు ప్రకటనే అని ప్రజలు అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?