ఆగిపోయిన పెళ్లికి మేళం వాయిస్తున్నారా?

ఒకప్పట్లో శాసనసభకు స్పీకరుగా కూడా పనిచేసిన నాయకుడు, ప్రజల్లోంచి వారి అభిమానం కూడగట్టుకుని గెలిచేంత బలం లేకపోయినప్పటికీ.. కనీసం మండలిలోనైనా చోటు దక్కించుకుంటూ.. తెలుగుదేశం రాజకీయాల్లో కీలకంగా చక్రం తిప్పుతూ ఉండే యనమల రామకృష్ణుడు…

ఒకప్పట్లో శాసనసభకు స్పీకరుగా కూడా పనిచేసిన నాయకుడు, ప్రజల్లోంచి వారి అభిమానం కూడగట్టుకుని గెలిచేంత బలం లేకపోయినప్పటికీ.. కనీసం మండలిలోనైనా చోటు దక్కించుకుంటూ.. తెలుగుదేశం రాజకీయాల్లో కీలకంగా చక్రం తిప్పుతూ ఉండే యనమల రామకృష్ణుడు ఇప్పుడు శాసనమండలికి ఉండగల అధికారాల గురించి మాట్లాడుతున్నారు. అసెంబ్లీనుంచి వచ్చిన బిల్లులను పరిశీలించడానికి శాసనమండలికి అధికారం ఉంటుందని ఆయన వెల్లడిస్తున్నారు. రాజ్యసభకు ఉన్నంత అధికారాలు మండలికి కూడా ఉంటాయని అంటున్నారు.

అంతా బాగానే ఉంది. ఇవన్నీ రాజ్యాంగపరంగా ఎంతో కొంత నిజమే కావొచ్చు కూడా.. కానీ.. అసలు జగన్మోహన రెడ్డి ప్రభుత్వం శాసనమండలిని ఏకంగా రద్దే చేసేసిన తర్వాత.. ఇంకా.. ఆయన సదరు మండలి అధికారాల గురించి ఏకరవు పెట్టడం చూస్తోంటే.. అయిపోయిన… కాదు కాదు.. ఆగిపోయిన పెళ్లికి మేళాలు వాయించిన చందంగా కనిపిస్తోంది.

అధికార వికేంద్రీకరణ బిల్లును ఏరోజైతే అడ్డుకోడానికని శాసనమండలి సాక్షిగా పెద్ద కుట్ర జరిగిందో.. అప్పుడే జగన్మోహన రెడ్డి సర్కారు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. ఆ సభలో ఉన్న బలాన్ని అడ్డుగా పెట్టుకుని.. ప్రభుత్వాన్ని  పని చేయనివ్వకుండా జరిగే కుట్రలకు సమూలంగా చెక్ పెట్టదలచుకుంది. ఫలితంగానే మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానించింది.

అక్కడితో మండలి అనే చాప్టర్ ముగిసిపోయినట్టే. అది అయిపోయిన అధ్యాయం. తెలుగుదేశం నాయకులు కొన్ని రోజుల పాటూ ఏదో నానా యాగీ చేయడానికి ఇది ఉపయోగపడవచ్చు గానీ.. మండలి గురించి ఎంత గోల చేసినా కూడా ఫలితం ఉండదు. అలాగే.. సెలక్ట్ కమిటీకి బిల్లు ను నివేదించడం వల్ల ఒరిగేదేమీ కూడా లేదు. జగన్ సర్కారు నిర్ణయాలు అమలు కావడంలో కొంత జాగు జరగవచ్చు. అంతే తప్ప అడ్డుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి నేపథ్యంలో.. పాపం.. ఇప్పుడు మండలి అధాకారాల గురించి త్వరలోనే పదవినే కోల్పోబోతున్న యనమల ఏకరవు పెట్టడం చూస్తోంటే ప్రజలకు జాలి కలుగుతోంది.

లోకేష్ ప్రెండ్ పై ఐటీ దాడులు చేస్తే మీరెందుకు..