యడ్యూరప్ప.. ఏడు రోజులా? అంతకు మించా?

ఇన్నాళ్లూ యడ్యూరప్పగా చలామణి అయిన బీజేపీనేత ఇప్పుడు యడియూరప్పగా మారారు. అయితే ఆయన పేరు మార్చుకోవడం కొత్త ఏమీకాదు. కొన్నేళ్ల కిందట, రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడూ ఇలాగే పేరు మార్చుకున్నారు. అప్పుడు యడియూరప్ప కాస్తా…

ఇన్నాళ్లూ యడ్యూరప్పగా చలామణి అయిన బీజేపీనేత ఇప్పుడు యడియూరప్పగా మారారు. అయితే ఆయన పేరు మార్చుకోవడం కొత్త ఏమీకాదు. కొన్నేళ్ల కిందట, రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడూ ఇలాగే పేరు మార్చుకున్నారు. అప్పుడు యడియూరప్ప కాస్తా యడ్యూరప్ప అయ్యారు. ఇప్పుడు యడ్యూరప్ప మళ్లీ యడియూరప్పగా మారారు.

ఆయన పేరు తెలుగు వాళ్లకు ఒక టంగ్ ట్విస్టర్ లా అనిపిస్తుంది. ఒక ఊరు పేరు మీదుగా ఆయన పేరు వచ్చింది. కర్ణాటకలో యడ్యూరు ఉంటుంది. ఆ యడ్యూరుకు అప్ప జోడిస్తే యడ్యూరప్ప. పాతకాలం పేరు.
మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు యడియూరప్ప. మరి ఈసారి ఆయన ఎన్నిరోజులు పీఠం మీద కూర్చుంటారు? అనేది చర్చనీయాంశంగా మారింది. పద్నాలుగు నెలల కిందట ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు బలనిరూపణలో ఫెయిల్ అయ్యి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఇక ఇప్పుడు యడియూరప్పకు వారంరోజుల పాటు గడువు ఇచ్చారు గవర్నర్. నంబర్ గేమ్ ప్రకారం చూస్తే బీజేపీకి కర్ణాటక అసెంబ్లీలో సొంతంగా బలం లేనట్టే. అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎలాగోలా బలనిరూపణ చేసుకోవచ్చనే లెక్కలతో ఉన్నారు కమలనాథులు. అయితే వాళ్లు ఎలా బలనిరూపణ చేసుకున్నా అది అనైతికమే అవుతుంది.

ఒకవేళ కాంగ్రెస్-జేడీఎస్ రెబెల్స్ సభకు హాజరుకాకుండా మొహంచాటేస్తే, బలపరీక్ష రోజున అసెంబ్లీకి కేవలం 208 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయితే అప్పుడు యడ్యూరప్ప సర్కారు నిలబడవచ్చు. అయినప్పటికీ.. రాజకీయ ప్రతిష్టంభన అయితే ముందు ముందు కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి.

డియర్ కామ్రేడ్.. విజయ్ జోక్యం నిజంగా ఉందా?

సినిమా రివ్యూ: డియర్‌ కామ్రేడ్‌