పచ్చదళం : సిగ్గుమాలిన బుకాయింపు!

ఏదో పనిచేసినట్లుగా ప్రజలకు ఒక భ్రమ కల్పించారు. ప్రజల్ని అదే భ్రమల్లోనే ఉంచేసి కోట్ల రూపాయలను స్వాహా చేశారు. ఇప్పుడు.. ప్రభుత్వం మారింది… చేసిన వంచన బట్టబయలౌతోంది. తమ పరువు బజార్న పడే పరిస్థితి…

ఏదో పనిచేసినట్లుగా ప్రజలకు ఒక భ్రమ కల్పించారు. ప్రజల్ని అదే భ్రమల్లోనే ఉంచేసి కోట్ల రూపాయలను స్వాహా చేశారు. ఇప్పుడు.. ప్రభుత్వం మారింది… చేసిన వంచన బట్టబయలౌతోంది. తమ పరువు బజార్న పడే పరిస్థితి కనిపిస్తుండే సరికి.. బుకాయింపులకు దిగుతున్నారు. ఆరోజు అవసరానికి తగినట్లుగా ఒక ప్రయత్నం చేశాం.. అందులో తప్పేముందు అని ఎదురు నిలదీస్తున్నారు. చూడబోతే పచ్చదళాల సిగ్గుమాలిన తనానికి అడ్డులేకుండా పోతున్నట్లున్నది.

చంద్రబాబునాయుడు హయాంలో అనంతపురం జిల్లాలో కరవు ప్రాంతాల్లో పొలాలకు నీటి సదుపాయం కల్పించడానికి వాటర్ గన్ లు తీసుకొచ్చిన విషయంలో ఎంత హడావిడి జరిగిందో అందరికీ తెలుసు. చంద్రబాబు ఈ విషయంలో నానా హంగామా చేశారు. వాటర్ గన్ లు అంటే.. అక్కడికి అవేదో నీటిని సృష్టించే యంత్రాలన్నట్లుగా, వాటితో సాటునీటి సమస్య సమూలంగా తొలగిపోతుందన్నట్లుగా ఆయన డప్పుకొట్టారు. వాటర్ గన్ అనే కాన్సెప్టుకు విపరీతంగా ప్రచారం కల్పించారు.

చంద్రబాబు పొలాల మీద పర్యటనలకు వెళ్లి.. తాను వాడినప్పుడు, ప్రారంభించినప్పుడు తప్ప… సదరు వాటర్ గన్ లు సజావుగా పనిచేసినట్లుగా ఎక్కడా వార్తలు రాలేదు. చాలా పరిమిత సమయం మాత్రమే అవి రైతులకు ఉపయోగపడ్డాయి. ఆ వెంటనే మూలనపడ్డాయి. ఆ రకంగా శవం మీద పైసలు ఏరుకునేంత నీచత్వంతో పోలగలిగేట్టుగా.. అనంతపురం జిల్లా కరవును కూడా తమ స్వార్థానికి, అడ్డోగోలు దోపిడీకి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎడాపెడా వాడుకుంది. ప్రస్తుతానికి సదరు వాటర్ గన్ లు మొత్తం మూలనపడ్డాయి.

ఈ విషయం మీద తాజాగా శాసనమండలిలో చర్చ నడిచింది. అప్పటి ప్రభుత్వం.. 116 కోట్లకు పైగా వాటర్ గన్ ల పేరిట వృథా చేసిందంటూ మంత్రి బొత్స అంటే.. తెలుగుదేశం ఎమ్మెల్సీలు దాన్ని బుకాయించేందుకు ప్రయత్నించడం దౌర్భాగ్యం. అప్పట్లో ప్రభుత్వం ఓ ప్రయత్నం చేసింది. అధికారుల్ని, కేబినెట్ ను అనంతపురానికి రప్పించి చంద్రబాబు ఎంతో శ్రమించారు… అంటూ వారు బుకాయిస్తున్నారు.

అనంతపురానికి ఎందురు వస్తే ఏంటి.. నీళ్లు మాత్రం రాలేదు. తగలేసిన సొమ్ముకు సరిపడా వాటర్ గన్ లు ఉపయోగపడడం లేదు. ఈ రకంగా అడ్డగోలు దోపిడీ బయటపడినప్పుడు.. ఇంకా దానిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తుండడమే చోద్యంగా ఉంది.

దేవరకొండ గురించి రష్మిక చెప్పిన ముచ్చట్లు

నటుడి కంటె నాయకుడికే ఎక్కువ కష్టం