ఎల్లో మీడియా…మీకు అర్థం అవుతోందా?

అయిదు వందలకు పైగా టెస్ట్ లు 13 మందికి కరోనా…తెలంగాణలో Advertisement 6,306 టెస్ట్ లు….62 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ…..ఆంధ్రలో…ఏం జరుగుతోంది? అసలు? తెలంగాణలో పరిస్థితులు భయంకరంగా వున్నాయని, బతికి వుంటే బలుసాకు…

అయిదు వందలకు పైగా టెస్ట్ లు 13 మందికి కరోనా…తెలంగాణలో

6,306 టెస్ట్ లు….62 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ…..ఆంధ్రలో…ఏం జరుగుతోంది? అసలు?

తెలంగాణలో పరిస్థితులు భయంకరంగా వున్నాయని, బతికి వుంటే బలుసాకు తినవచ్చని, ఆర్థిక వ్యవహారాలు ముఖ్యం కాదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ బాహాటంగా ప్రకటించారు. మోడీ ప్రకటించిన దానికన్నా మరోవారం ఎక్కువ లాక్ డౌన్ అన్నారు. కానీ చిత్రంగా హైదరాబాద్ లో ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు జనాలు తిరుగుతూనే వున్నారు.

అయితే ఆంధ్రలో పరిస్థితి దీనికి భిన్నంగా వుంది. మోడీ ప్రకటించిన లాక్ డౌన్ గురించి సిఎమ్ జగన్ ఏమీ కామెంట్ చేయలేదు. కానీ చిత్రంగా మోడీ ప్రభుత్వం ప్రకటించిన రిలాక్సేషన్ లు కూడా ఇవ్వలేదు.సైలంట్ గా లాక్ డౌన్ ను యధాతథంగా నడిపేస్తున్నారు. ఉదయం 9 దాటితో జనాలు తిరగడానికి లేదు. దుకాణాలు వుండడానికి లేదు.

పైగా తెలంగాణలో రోజుకు అయిదు వందలకు మించి టెస్ట్ లు చేయడం లేదు ఆంధ్రలో వేలకు వేల మందికి పరీక్షలు చేస్తున్నారు. 

అయిదు వందల మందికి పరిక్షలు చేస్తే 13 మందికి నిర్ధారణ అయింది.

మరి ఆంధ్రలో ఆరు వేల మందికి చేసారు ఈ రోజు. తెలంగాణ సగటుతో పోల్చుకుంటే, 150 మంది వరకు పాజిటివ్ రావాలి. కేవలం 62 మందికే వచ్చింది. ఇక్కడ రెండు పాయింట్లు వున్నాయి. ఒకటి వేలకు వేల మందికి టెస్ట్ లు చేసుకుంటూ వెళ్లడం అత్యవసరం. ఆహ్వానించదగ్గ పరిణామం. అలాగే వందలు, వేలు అని కాదు, ఎంతమందికి కరోనా వుంటే అంతమందీ బయటకు రావాలి. అదే మంచిది సమాజానికి. 

కానీ ఆంధ్రలో ప్రతపక్షం, జగన్ పై కక్ష కట్టిన సామాజిక వర్గ మీడియా మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదు. కేసిఆర్ ను ఎందుకు ఇంత తక్కువ మందికి టెస్ట్ చేస్తున్నారు అని నిలదీయడం లేదు. ఆంధ్రలో మాత్రం ఇంత మందికి వచ్చేసింది. అంత మందికి వచ్చేసింది అని హడావుడి చేస్తున్నాయి. అదే టైమ్ లో అసలు ఎంత మందికి టెస్ట్ చేస్తే ఎంత మందికి వచ్చిందన్నది చెప్పడం లేదు. 

ఆఖరికి చావులో కూడా ఈ మీడియా రాజకీయాలు చేయడం కన్నా హీనమైనది మరోటి లేదు. అదే సమయంలో తెలంగాణలో గొంతెత్త లేక, కలుగులో దాక్కోవడం కూడా ఈ సామాజిక వర్గ మీడియాకే చెల్లింది.