Advertisement

Advertisement


Home > Politics - Gossip

జోన్ లు-మంచి ఐడియా

జోన్ లు-మంచి ఐడియా

జోన్  ల వారీ పరిపాలన వికేంద్రీకరణ చేయాలన్న ఆలోచనను ప్రభుత్వం చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఇది కొంచెం కొత్తగా అనిపంచవచ్చు తెలియని వారికి. కానీ ఇది మంచి ఆలోచనే. అసలు జోన్ ల వారీ పరిపాలన అంటే ఎలా వుంటుంది అన్నది చూద్దాం.

సాధారణంగా పరిపాలన అనేది మండల, సబ్ డివిజన్, జిల్లా స్థాయిల్లో వుంటుంది. ఆ తరువాత నేరుగా సంబంధత శాఖ డైరక్టర్ ఆఫీసు రాజధానిలో వుంటుంది. ఏ శాఖ డైరక్టర్ కార్యాలయంలో నైనా డైరక్టర్, డిప్యూటీ డైరక్టర్ వుండి, సిబ్బందితో కలిసి పని చేస్తారు. వాళ్ల మీద సంబంధిత శాఖ సెక్రటరీ వుంటారు. 

ఇప్పుడు ప్రభుత్వం తలపెట్టిన ఈ రీజనల్ డివిజన్ పద్దతి అమలు అయితే ప్రాంతాల వారీగా రీజనల్ డైరక్టర్ లు, వారి కార్యాలయాలు వుంటాయి. అంటే మండల, డివిజన్, జిల్లా ఆఫీసుల తరువాత రీజనల్ డైరక్టర్ కార్యాలయం వస్తుంది కొత్తగా. ఇక రాజధాని వరకు వెళ్లాల్సిన పని వుండదు. 

ఇప్పటికే ఇలాంటి పద్దతి మెడికల్ అండ్ హెల్త్ లో అమలులో వుంది. మెడికల్ అండ్ హెల్డ్ లో రాష్ట్రం అంతా అయిదారు రీజనల్ జోన్ లుగా వుంది. రీజనల్ డైరక్టర్లే ఆ రీజియన్ వ్యవహారాలు అన్నీ చూస్తారు. నియామకాలు, బదిలీలు, పింఛన్లు అన్నీ అక్కడే సెటిల్ అవుతాయి. అంటే ఏ ప్రాంతం వారు ఆ రీజియన్ హెడ్ క్వార్ట్స్ దాటి ముందుకు వెళ్లాల్సిన పని వుండదు. డబ్బు, సమయం ఆదా.

దీన్నేమీ పది రాజధానులు అని అనరు. ఇప్పటికే కొన్ని శాఖల్లో అమలు వున్న పద్దతి కూడా. పరిపాలన వికేంద్రీకరణ సాధ్యం అవుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి కాస్త అదనపు ఖర్చు. ప్రతిశాఖకు ఓ నాలుగు లేదా అయిదు రీజనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. అంతే. 

విశాఖ, రాజమండ్రి, విజయవాడ, రాయలసీమ ఇలా నాలుగు రీజనల్ జోన్ లు వుంటాయి. జనాలకు ఉద్యోగులకు ఇది చాలా వెసులుబాటుగా వుంటుంది. కానీ ఓ వర్గం మీడియా ఇది కూడా కుట్ర అని, రాజధానిని నీరసింపచేయడానికి అనీ అనడం అంటే ఇంక ఏమనాలి? ఎన్టీఆర్ మండలాలు ఏర్పాటు చేసారు పరిపాలన వికేంద్రీకరణ కోసం. సమితి కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. ఇప్పుడు రీజినల్ డివిజన్ లు అంటే అలాంటిదే కాస్త పెద్ద స్కేల్ లో.

ఇంతకీ ఈ విషయంలో సిఎమ్ జగన్ మదిలో ఏం ఆలోచన వుందో తెలియాల్సి వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?