పుట్టుక – మరణం మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టాలు. అరిస్టాటిల్ రాజకీయాలను గురించి విశ్లేషణ చేస్తూ ఇలా అంటారు…. 'ఉయ్యాల నుంచి కాటి వరకు ప్రజలకు సంబంధించిన అన్నీ విషయాలను గురించి చర్చించేదే ప్రభుత్వం , దానికి నాయకత్వం వహించేది రాజకీయ వ్యవస్థ : పుట్టుకను అందరం సంతోషంగా జరుపుకుంటాము.
మరణించిన వ్యక్తి దహన సంస్కరణలను బాధతో చేసినా బాధ్యతతో చేస్తారు. మరణించిన వ్యక్తి మీద ఉన్న గౌరవంతోనే కాదు వారి వారసులు , వారి మీద ఆధారపడిన వారికి భరోసా కల్పించే దిశగా సమాజం బాధ్యత తీసుకుంటుంది. అలాంటి దహన సంస్కారాలు నేడు కరోన కారణంగా దయనీయంగా మారింది.
ఆప్తులు చనిపోయి బాధపడుతున్న వారికి చివరి సంస్కారాలు చేయకపోవడం , దగ్గర వారు సయితం చివరి సారి చూడలేక పోతున్నారన్న బాధ వర్ణనాతీతం. కరోనాతో మరణించిన వారిని దగ్గరగా ఉండి అంతిమ సంస్కారాలు చేయాలనే కోరిక ఒక వైపు ఆ పని చేస్తే కరోనా వస్తుందేమో అని భయం మనిషిని వేధిస్తోంది.
మన కుటుంబ సభ్యులకు మరెవరో అంతిమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్న స్థితి దయనీయంగా ఉంది. ఈ మధ్య జరిగిన మరణంతో వారి కుటుంభ సభ్యులు నాతో అన్న మాట 'కొన్ని రోజుల ముందు చనిపోయి ఉంటే బాగుణ్ణు అని' పరిస్థితి ఎంత విషాదమో ఈ ఒక్క ఉదాహరణ చెపుతుంది.
కరోన రోగంతో చనిపోయిన వారి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తులు చేయలేరు. వ్యవస్థలు మాత్రమే చేయగలవు. అందుకుగాను సంచార వాహనాల ద్వారా దహన క్రియలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం పరిస్కారంగా కనిపిస్తుంది. గతంలో నెల్లూరు జిల్లాలో ఒక వైద్యుడు చనిపోతే వారి దహన క్రియలు అంతకు మించి విషాదాన్ని నింపింది.
ఈ పరిస్థితి మరొకరికి రాకుండా ఉండాలి. కరోనా వచ్చిన ఓ వ్యక్తికి సాయం కావాలని కోరితే ఓ పెద్దాయన అన్న మాట “చూడు పురుషోత్తం బాధాకరం అయినా కఠోర సత్యాన్ని చెపుతున్నాను నీవు హాస్పిటల్ లో బెడ్ ఆడిగావు స్మశానంలో దహనక్రియల ఏర్పాటుకు కూడా సాయం చేయలేని నిస్సాయక స్థితి” దుస్థితికి అద్దం పట్టే ఉదాహరణ.
అందుకని సంచార వాహనాన్ని ఏర్పాటు చేయడం వల్ల కారోనా నుంచి ప్రభుత్వం సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటారు. బందువుల మధ్య దహన క్రియలు జరుగుతాయి. చివరిగా చితాభస్మాన్ని అవకాశం ఉంటే కుటుంబ సభ్యులకు ఇవ్వవచ్చు.
కారోనా సమస్య పరిష్కారం జరిగే వరకు ఉపయోగించి తర్వాత సాదారణ మరణాలకు కూడా ఉపయోగించే అవకాశాన్ని పరిశీలించవచ్చు. ఈ కష్ట కాలంలో ప్రజల కోసం అనేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాలు సున్నితమైన దహన సంస్కారాలకు సంచార వాహనాన్ని ఏర్పాటు చేయాడం సముచితంగా ఉంటుంది. ప్రభుత్వాలు పరిశీలించాలి.
-మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, తిరుపతి, 9490493436