మరో కర్ణాటక.. హర్యానా!

హర్యానాలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా హర్యానాలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చాయి. అయితే అనూహ్య రీతిలో హర్యానాలో కమలం పార్టీ కుదేల్ అయ్యింది.…

హర్యానాలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా హర్యానాలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చాయి. అయితే అనూహ్య రీతిలో హర్యానాలో కమలం పార్టీ కుదేల్ అయ్యింది. కనీస మెజారిటీని సాధించలేకపోయింది. గత పర్యాయం మినిమం మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ఇప్పుడు మాత్రం హర్యానా ప్రజలకు ఝలక్ ఇచ్చారు. మొత్తం తొంభై సీట్లున్న హర్యానాలో బీజేపీ దాదాపు నలభై సీట్లను పొందుతుండగా, కాంగ్రెస్ పార్టీ ముప్పై సీట్లలో ముందజంలో ఉంది.

పదకొండు సీట్లలో స్థానిక ప్రాంతీయ పార్టీ ఒకటి లీడింగ్ లో ఉంది. ఇక మిగిలిన సీట్లు అటూ ఇటూ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేయగలదా? అనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. అదలా ఉంటే.. హర్యానా మరో కర్ణాటకగా మారినట్టుందని విశ్లేషకులు అంటున్నారు. కర్ణాటకలో బీజేపీ ఎలాంటి పరిస్థితుల్లో నిలిచిందో.. అలాంటి స్థానంలో హర్యానా కాంగ్రెస్ ఉంది. ఇలాంటి నేపథ్యంలో చిన్న పార్టీల, ఇండిపెండెంట్స్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా తనవంతు ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆ పార్టీ నేతలు ప్రకటించుకుంటూ ఉన్నారు. అందుకోసం పది సీట్లు కూడా సాధించని ప్రాంతీయ పార్టీతో చర్చలు జరుపుతూ, ఏకంగా సీఎం సీటునే అఫర్ చేస్తున్నారట!

'మా' రచ్చ మాములూగా లేదుగా.. మొత్తం తిట్లే