ఈసారి గ్యాప్ తీసుకోవడం గ్యారెంటీ

ఈమధ్య కాలంలో పెద్దగా గ్యాప్ తీసుకోలేదు మహేష్ బాబు. మధ్యమధ్యలో విహార యాత్రలకు వెళ్లినా ఏదో ఒక సినిమా సెట్స్ పై నడుస్తూనే ఉంది. అయితే ఈసారి మాత్రం నిజంగా గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్…

ఈమధ్య కాలంలో పెద్దగా గ్యాప్ తీసుకోలేదు మహేష్ బాబు. మధ్యమధ్యలో విహార యాత్రలకు వెళ్లినా ఏదో ఒక సినిమా సెట్స్ పై నడుస్తూనే ఉంది. అయితే ఈసారి మాత్రం నిజంగా గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు ఈ హీరో. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత అటుఇటుగా మహేష్ 4 నెలలు గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాడు.

ఈ మధ్యంతా ఓ సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమా ఎనౌన్స్ చేశాడు మహేష్. కానీ సరిలేరు నీకెవ్వరు సినిమా ఓ కొలిక్కి వస్తున్నప్పటికీ ఇప్పటివరకు కొత్త సినిమా ప్రకటించలేదు. వచ్చేనెలాఖరుకు సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అప్పటికి మహేష్ ఖాతాలో ఉన్న దర్శకులెవరూ అందుబాటులోకి రావడంలేదు.

మొన్నటివరకు మహేష్ తో సినిమా చేయాలని ప్రయత్నించిన సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాను కూడా బాలీవుడ్ నే ప్రకటించాడు. అటు మహేష్ తో సినిమా అంటూ కేజీఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ అదింకా చర్చల్లోనే ఉంది. మరోవైపు మహేష్ తో స్టోరీలైన్ ఓకే అనిపించుకున్న వంశీ పైడిపల్లి, ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కు చాలా టైమ్ తీసుకుంటున్నాడు.

సో.. ఇలా ఎవ్వరూ అందుబాటులోకి రాకపోవడంతో మహేష్ గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అన్నట్టు మహేష్ తోనే మరో మూవీ చేసే ఆలోచనలో ఉన్న అనీల్ రావిపూడి.. ఇప్పటికే అతడికి మరో స్టోరీలైన్ వినిపించాడు. మరి మహేష్ నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుందో!

'మా' రచ్చ మాములూగా లేదుగా.. మొత్తం తిట్లే