పదిహేడేళ్ళుగా ఆడిట్ జరగలేదా… ?

ఏ సంస్థకైనా ఆడిట్ రిపోర్ట్ అన్నది అవసరం. అది తప్పనిసరి కూడా. మరి ట్రస్ట్ గా కొనసాగుతూ వస్తున్న ప్రతిష్టాత్మకమైన సంస్థ మాన్సాస్ లో పదిహేడేళ్ళుగా ఆడిట్ జరగలేదు అన్న వార్త విస్మయం కలిగితోంది.…

ఏ సంస్థకైనా ఆడిట్ రిపోర్ట్ అన్నది అవసరం. అది తప్పనిసరి కూడా. మరి ట్రస్ట్ గా కొనసాగుతూ వస్తున్న ప్రతిష్టాత్మకమైన సంస్థ మాన్సాస్ లో పదిహేడేళ్ళుగా ఆడిట్ జరగలేదు అన్న వార్త విస్మయం కలిగితోంది.

ఈ విషయాన్ని జిల్లా ఆడిటర్ డాక్టర్ హిమబిందు మీడియా ముఖంగానే చెబుతూ తాము ప్రతీ ఏడాది ఆడిట్ చేయించుకోమని ట్రస్ట్‌కి లేఖలు రాస్తూనే ఉన్నామని చెప్పుకొచ్చారు. మాన్సస్‌లో ఆడిట్ చేయించుకోవాల్సిన బాధ్యత ట్రస్ట్ అధికారులదే అని ఆమె స్పష్టం చేయడం విశేషం.

మొత్తానికి మాన్సాస్ ట్రస్ట్ లో ఆడిట్ 2004 నుంచి నిలిచిపోయిందని అంటున్నారు. పూర్తి రికార్డులు అందిన తరువాతనే మాన్సాస్ ట్రస్ట్ లో ఆడిట్ ప్రారంభిస్తామని ఆమె హిమబిందు చెబుతున్నారు.  

ఇవన్నీ పక్కన పెడితే మాన్సాస్ ట్రస్ట్ లో అవకతవకల మీద ఓ వైపు ప్రభుత్వం విచారణకు ఆదేశించడం మరో వైపు ఆడిట్ కి అవసరమైన రికార్డుల కోసం జిల్లా ఆడిట్ అధికారిని అక్కడికి హుటాహుటిన పంపించడంతో రాబోయే రోజులలో అక్కడ ఏం జరగబోతోంది అన్నది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.