పాఠాలు చెప్పకుండా పైశాచికత్వం చూపించాడు

గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాడు. పిల్లలకు పాఠాలు చెప్పి వాళ్లను భావిపౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు అతడు. కానీ ఏనాడూ అలా ప్రవర్తించలేదు. ఉపాధ్యాయ సమాజం సిగ్గుతో తలదించుకునే పని చేశాడు. విద్యార్థినులకు నీలి చిత్రాలు చూపించి,…

గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాడు. పిల్లలకు పాఠాలు చెప్పి వాళ్లను భావిపౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు అతడు. కానీ ఏనాడూ అలా ప్రవర్తించలేదు. ఉపాధ్యాయ సమాజం సిగ్గుతో తలదించుకునే పని చేశాడు. విద్యార్థినులకు నీలి చిత్రాలు చూపించి, వాళ్లతో మసాజ్ లు చేయించుకున్నాడు. గుంటూరు జిల్లాలో జరిగింది ఈ దారుణం.

గుంటూరు జిల్లా గణపవరంలో ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటేశ్వర రావు చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. చిన్నారులతో ఒళ్లు పట్టించుకోవడం, తలకు మసాజ్ చేయించుకోవడం, కాళ్లు ఒత్తించుకోవడం లాంటి పనులన్నీ చేయించుకునేవాడు. అక్కడితో ఆగకుండా ఈమధ్య విద్యార్థినులకు నీలిచిత్రాలు చూపించడం ప్రారంభించాడు.

కొన్నాళ్ల పాటు వ్యవహారం బాగానే నడిచింది. కానీ హెడ్ మాస్టర్ ప్రవర్తనతో విద్యార్థినులు విసిగిపోయారు. కొంతంమంది తమ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు. తాము చూస్తున్నది ఎలాంటి వీడియోలో కూడా తెలియని ఆ చిన్నారులు.. కళ్లు బైర్లు కమ్మే విషయాలు చెబుతుంటే తల్లిదండ్రులకు కోపం కట్టలు తెచ్చుకుంది.

స్కూల్ కు చేరుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు వెంకటేశ్వరరావును చితకబాదారు. తర్వాత పోలీసులకు ఫోన్ చేసి అప్పగించారు. పోలీసులు వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈలోపు విద్యాశాఖ కూడా ఈ నీచ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంది. వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది.

బాధపడుతున్న వంశీ పైడిపల్లి