జగన్ సర్కార్ కు మరో గ్రీన్ సిగ్నల్!

ఇప్పటికే రివర్స్ టెండరింగ్ విషయంలో అనుకున్న రీతిన ముందుకు వెళ్లి వేలకోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు మిగిలించే దిశగా సాగుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వానికి మరో విజయం లభించింది. జగన్ గట్టిగా పట్టుపడుతున్న విద్యుత్…

ఇప్పటికే రివర్స్ టెండరింగ్ విషయంలో అనుకున్న రీతిన ముందుకు వెళ్లి వేలకోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు మిగిలించే దిశగా సాగుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వానికి మరో విజయం లభించింది. జగన్ గట్టిగా పట్టుపడుతున్న విద్యుత్ ఒప్పందాల పునః సమీక్ష విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి బాసటగా నిలిచింది. ఒప్పందాలను సమీక్షించుకునే అధికారం ఏపీ ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ విషయంలో హైకోర్టుకు వెళ్లిన విద్యుత్ కంపెనీలకు ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని కోర్టు స్పష్టంచేసింది. ఇకపై ఈ అంశంపై ఏవైనా వాదనలు వినిపించాలన్నా ఏపీఈఆర్సీ వద్దకే వెళ్లాలని కూడా కోర్టు కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది.

చంద్రబాబు నాయుడి హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో రాష్ట్ర ఖజానాకు అపరిమితమైన భారం పడుతుందని జగన్ మొదటి నుంచి వాదిస్తూ వచ్చారు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే విమర్శలు సాగించారు. అధికారం అందగానే.. వాటి పై పునఃసమీక్షకు జగన్ సమాయత్తం అయ్యారు. ఈ విషయంలో కేంద్రం కూడా లేఖలతో వారించే ప్రయత్నం చేసింది.

అయితే రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడుతోందని ఈ విషయంలో జగన్ ముందుకే సాగారు. దీంతో కంపెనీలు కోర్టుకు ఎక్కాయి. ఇప్పుడు కోర్టు ఆ కంపెనీలకు మొట్టికాయలు వేసింది. ప్రభుత్వం పునఃసమీక్షించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.

అలాగే ప్రస్తుతానికి విద్యుత్ ను యథాతథంగా కొనుగోలు చేయాలని, నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయాన్ని అయినా తీసుకోవచ్చని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. వివాదాలను ఏపీఈఆర్సీలో పరిష్కరించుకోవాలని ఆదేశించింది. 

సైరా… ఒక మాంఛి కమర్షియల్ విందు