కోడెల సెల్ ఫోన్ ను అప్పగించని కుటుంబ సభ్యులు!

మాజీ స్పీకర్, తెలుగుదేశం నేత కోడెల శివప్రసాద్ రావు మరణంపై అంతులేని రాజకీయం చేయాలని చూసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమని సమాధానం ఇస్తారో కానీ.. కోడెల వాడిని సెల్ ఫోన్ ను ఆయన…

మాజీ స్పీకర్, తెలుగుదేశం నేత కోడెల శివప్రసాద్ రావు మరణంపై అంతులేని రాజకీయం చేయాలని చూసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమని సమాధానం ఇస్తారో కానీ.. కోడెల వాడిని సెల్ ఫోన్ ను ఆయన కుటుంబీకులు ఇప్పటివరకూ పోలీసులకు అప్పగించలేదని వార్తలు వస్తున్నాయి. కోడెలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందుల పాల్జేసిందని, అందుకే ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారని చంద్రబాబు నాయుడు ప్రచారం చేయ ప్రయత్నించారు.

అయితే ప్రభుత్వ వేధింపులను తాళలేక కోడెల సూసైడ్ చేసుకున్నట్టు అయితే ఆయన లేఖ రాసేవారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కోడెల ఆత్మహత్య వెనుక వేరే కారణాలు ఉండవచ్చని వ్యాఖ్యానించారు. ఇలాంటి క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటి వరకూ కోడెల సెల్ ఫోన్ ను పోలీసులకు అప్పగించలేదనే వార్తలు ఆశ్చర్యం కలిగించకమానవు.

కోడెల శివప్రసాద్ రావు చివరిసారిగా ఎవరికి ఫోన్ చేశారు, గత కొన్నాళ్లుగా ఆయన మానసిక పరిస్థితి ఏమిటి, ఎవరితో మాట్లాడారు.. వంటి వివరాలన్నీ బయటకు రావడానికి ఫోన్ కీలకమైన ఆధారంగా ఉండవచ్చు. ఫోన్ పోలీసులకు అందితే.. అనుమానాస్పద స్థితిలో మరణంగా నమోదైన కోడెల కేసు చిక్కుముడి వీడవచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కోడెల కుటుంబీకులు ఇప్పటివరకూ ఆయన ఫోన్ ను పోలీసులకు  ఇవ్వడం లేదట!

ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారు? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కోడెల మరణంపై చాలా రాజకీయం చేయాలని ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన కుటుంబీకులు విచారణకు పెద్దగా సహకరించకపోవడాన్ని ఏమంటారు? కోడెల మరణంపై అంత మాట్లాడిన చంద్రబాబు నాయుడు విచారణ సజావుగా సాగేందుకు ఆ ఫోన్ ను పోలీసులకు అప్పగించాలని తమ పార్టీ నేత కుటుంబ సభ్యులకు సూచించగలరా?

సైరా… ఒక మాంఛి కమర్షియల్ విందు