‘అల’ ఓవర్ సీస్ @ 8.56 కోట్లు

త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో హారిక హాసిని సంస్థ నిర్మిస్తున్న అల వైకుంఠపురంలో. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా మార్కెటింగ్ వ్యవహారాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్ర, సీడెడ్ నైజాం ఏరియాలకు ఇంకా రేటు ఫిక్స్…

త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో హారిక హాసిని సంస్థ నిర్మిస్తున్న అల వైకుంఠపురంలో. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా మార్కెటింగ్ వ్యవహారాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్ర, సీడెడ్ నైజాం ఏరియాలకు ఇంకా రేటు ఫిక్స్ చేయలేదు. ముందుగా ఓవర్ సీస్ క్లోజ్ చేసారు. ఓవర్ సీస్ మార్కెట్ ఇటీవల అంత ఆశాజనకంగా లేదు. అందువల్ల సరైన రేట్లు రావడంలేదు.

ఇలాంటి నేపథ్యంలో అల వైకుంఠపురంలో సినిమాను తొమ్మిది కోట్లు రేషియోలో ఇచ్చేసారు. 8.56 కోట్లకు ఔట్ రేట్ చేసి, నలభై వేలు రికవరబుల్ అడ్వాన్స్ కలిపి తొమ్మిది కోట్లకు ఇచ్చారు. అంటే ఒక విధంగా 8.56 కోట్లకే విక్రయించినట్లు. ఓ విధంగా చూసుకుంటే ఇది మంచి రేటే.

ఇప్పుడున్న మార్కెట్ ఈ మధ్య పెద్ద హీరోల సినిమాల ట్రాక్ రికార్డు, అలాగే అల్లు అర్జున్ ఓవర్ సీస్ లెక్కలు, అన్నింటికి మించి సంక్రాంతికి మహేష్, రజనీ, బన్నీ సినిమాలు పోటీపడడం వంటివి అన్నీ చూసుకంటే సినిమాకు మంచి రేటు వచ్చినట్లే లెక్క.

ఓవర్ సీస్ లో త్రివిక్రమ్ కు వున్న మార్కెట్ వల్ల ఈ రేటు వచ్చిందని అనుకోవాలి. అల వైకుంఠపురములో సినిమా ఓవర్ సీస్ రైట్స్ కోసం మరో ఒకరిద్దరు ట్రయ్ చేసారు కానీ, రెగ్యులర్ బయ్యర్ గా బ్లూ స్కయ్ సంస్థకు ఈ హక్కులు దొరికాయి.

సైరా… ఒక మాంఛి కమర్షియల్ విందు