న్యాయ‌వాదుల‌కు హైకోర్టు షాక్‌

తెలంగాణ హైకోర్టు నిల‌దీత‌తో న్యాయ‌వాదులు షాక్‌కు గుర‌య్యారు. కోవిడ్ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని న్యాయ‌వాదులు, క్ల‌ర్కుల‌కు ప్ర‌భుత్వం ఆర్థిక సాయం చేయాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై తెలంగాణ హైకోర్టు సీరియ‌స్‌గా స్పందించింది. న్యాయ‌వాది భాస్క‌ర్ వేసిన ప్ర‌జాప్ర‌యోజ‌న…

తెలంగాణ హైకోర్టు నిల‌దీత‌తో న్యాయ‌వాదులు షాక్‌కు గుర‌య్యారు. కోవిడ్ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని న్యాయ‌వాదులు, క్ల‌ర్కుల‌కు ప్ర‌భుత్వం ఆర్థిక సాయం చేయాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై తెలంగాణ హైకోర్టు సీరియ‌స్‌గా స్పందించింది. న్యాయ‌వాది భాస్క‌ర్ వేసిన ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యంపై నేడు హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది.

ఈ సంద‌ర్భంగా న్యాయ‌వాదుల‌కు హైకోర్టు కొన్ని ప్ర‌శ్న‌ల‌ను సంధించింది. న్యాయ‌వాదుల‌ను ప్ర‌భుత్వం ఎందుకు ఆదుకోవాల‌ని హైకోర్టు ప్ర‌శ్నించింది. న్యాయ‌వాదుల‌ను ఆదుకునే బాధ్య‌త బార్ కౌన్సిల్‌, న్యాయ‌వాదుల సంఘాల‌దే అని హైకోర్టు తేల్చి చెప్పింది.

అంతేకాదు, న్యాయవాదులు ప్రభుత్వంపై ఆధారపడొద్దని సూచించింది. సొంత నిధి ఏర్పాటు చేసుకోవాలని కోరింది. సీనియర్‌ లాయర్ల సహకారంతో నిధి ఏర్పాటు చేసుకోవాలని వివరించింది. దీనికి సంబంధించి వారం రోజుల్లో వివరాలు సమర్పించాలని బార్ కౌన్సిల్‌ను హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు తీర్పుతో త‌మ‌కు అనుకూలంగా రాక‌పోవ‌డంతో న్యాయ‌వాదులు నిరాశ‌కు గుర‌య్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో న్యాయ‌వాదుల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆర్థికంగా సాయం అంద‌జేస్తోంది. ఏపీలో మాదిరిగానే తెలంగాణ‌లో కూడా ప్ర‌భుత్వం నుంచి సాయం అందుతుంద‌ని ఆశించి హైకోర్టును ఆశ్ర‌యించ‌గా, ప్ర‌తికూల తీర్పు రావ‌డం గ‌మ‌నార్హం.