ఒక రోజు ఆలస్యంగా కీలక భేటీ.. కారణం ఏంటి?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై హైపవర్ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. లెక్కప్రకారం రేపు ఈ కమిటీ భేటీ అవ్వాలి. కానీ ఒక రోజు ఆలస్యంగా, మంగళవారం నాడు ఈ కమిటీ సభ్యులంతా సమావేశమౌతారు. కొంతమంది…

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై హైపవర్ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. లెక్కప్రకారం రేపు ఈ కమిటీ భేటీ అవ్వాలి. కానీ ఒక రోజు ఆలస్యంగా, మంగళవారం నాడు ఈ కమిటీ సభ్యులంతా సమావేశమౌతారు. కొంతమంది మంత్రులు, అధికారులు అందుబాటులో లేకపోవడం వల్లనే ఈ సమావేశాన్ని 24 గంటలు వాయిదావేసినట్టు ప్రకటించారు. సెక్రటేరియట్ లేదా సీఆర్డీఏ ఆఫీస్ లో హై-పవర్ కమిటీ భేటీ అవుతుంది.

రాజధానికి సంబంధించి ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. తాజాగా బోస్టన్ గ్రూప్ కూడా తన టెక్నికల్ నివేదిక సమర్పించింది. ఈ రెండు నివేదికలపై చర్చించి ఓ తుది నివేదికను తయారుచేసే బాధ్యతను హై-పవర్ కమిటీకి అప్పగించారు ముఖ్యమంత్రి జగన్.  ఆర్థిక మంత్రి బుగ్గన, రవాణామంత్రి పేర్ని నాని, హోం మంత్రి సుచరితతో పాటు మొత్తం 10 మంది మంత్రులు సభ్యులుగా ఉన్నారు. వీళ్లతో పాటు ఆరుగురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిపి మొత్తం 16 మంది సభ్యులతో ఈ హైపవర్ కమిటీ ఏర్పాటైంది.

వీళ్లలో కొంతమంది ప్రస్తుతం అందుబాటులో లేరు. వాళ్లందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని హై-పవర్ కమిటీ సమావేశాన్ని ఒక రోజుకు వాయిదా వేశారు. ఈ కమిటీ 20వ తేదీలోగా తన తుది నివేదికను ముఖ్యమంత్రి జగన్ కు సమర్పిస్తుంది. అవసరమైతే తన తుది నివేదిక కోసం ఈ హై-పవర్ కమిటీ అడ్వకేట్ జనరల్ సూచనలు, సలహాలు కూడా తీసుకోవచ్చు. తర్వాత దానిపై కేబినెట్ లో చర్చించి రాజధాని అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటారు.