వంచనకు వందదారులు.. లొంగేవాడు దొరికితే బ్లాక్ మెయిల్ చేయడం ఇప్పుడు డెడ్ ఈజీ అయిపోయింది. మరీ ముఖ్యంగా అందాల్ని ఎరగా చూపించి వంచించడం అనేది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. దీన్నే ముద్దుగా హనీట్రాప్ అని పిలుస్తున్నారు. ఇలాంటి ఓ హనీట్రాప్ ఉదంతం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన అందాల్ని ఎరగా వేసి ఓ వగలాడి సాగించిన బ్లాక్ మెయిలింగ్ ను పోలీసులు బట్టబయలు చేశారు. ఆ వగలాడి భర్త స్వయంగా ఈ వ్యవహారం మొత్తాన్ని నడిపించడం మరీ సిగ్గుచేటు.
వివరాల్లోకి వెళ్తే… కనిష్క అనే మహిళ అందంగా ఉంటుంది. గతంలో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం కూడా చేసింది. అలా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన కనిష్క, ఈజీమనీ కోసం హనీట్రాప్ లోకి దిగింది. మెల్లగా ఓ వ్యాపారవేత్తను లొంగదీసుకుంది. ఓరోజు అతడ్ని శంకరపల్లి రిసార్ట్ కు తీసుకెళ్లింది. భర్త విజయ్ కుమార్ సహాయంతో అతడికి మత్తుమందు ఇచ్చింది. తను నగ్నంగా మారింది, వ్యాపారవేత్తను కూడా నగ్నంగా మార్చేసింది. ఇద్దరూ కలిసి మంచంపై నగ్నంగా పడుకుంటే, కనిష్క భర్త విజయ్ కుమార్ ఆ సన్నివేశాల్ని షూట్ చేశారు.
అలా షూట్ చేసిన దృశ్యాల ఆధారంగా సదరు వ్యాపారవేత్తను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది కనిష్క. మొదట దీనికి లొంగిన బిజినెస్ మేన్ 20 లక్షలు సమర్పించుకున్నాడు. కానీ కనిష్క-విజయ్ కుమార్ కోటి డిమాండ్ చేశారు. దీంతో గత్యంతరం లేక పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదుచేసుకున్న శంషాబాద్ పోలీసులు కనిష్క, విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను ప్రశ్నిస్తే మరిన్ని ఆశ్చర్యకర వివరాలు వెలుగులోకి వచ్చాయి.
గతంలో ఓ చర్చి పాస్టర్ ను కూడా ఇలానే వీళ్లు వశపరుచుకున్నారు. అతడి నుంచి లక్షల రూపాయలు గుంజారు. ప్రస్తుతం వ్యాపారవేత్తతో పాటు ఓ ఎన్నారైని ట్రాప్ లోకి లాగారు. అంతేకాకుండా, వీళ్ల వద్ద నుంచి ఓ తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.