హుదూద్.. తిత్లీ.. గులాబ్… తేడా ఏంటంటే… ?

విభజన ఆంధ్రాకి శతకోటి కష్టాలలో ఇది ఒకటి. ఇది ప్రకృతి పరమైనది. ఎవరూ ఏమీ చేయలేరు. మొత్తం పదమూడు జిల్లాలు ఉంటే అందులో తొమ్మిది జిల్లాలు ఏకంగా సముద్రానికి అభిముఖంగా ఉన్నాయి. మొత్తం తీర…

విభజన ఆంధ్రాకి శతకోటి కష్టాలలో ఇది ఒకటి. ఇది ప్రకృతి పరమైనది. ఎవరూ ఏమీ చేయలేరు. మొత్తం పదమూడు జిల్లాలు ఉంటే అందులో తొమ్మిది జిల్లాలు ఏకంగా సముద్రానికి అభిముఖంగా ఉన్నాయి. మొత్తం తీర ప్రాంత జిల్లాలు ఇవి. ఏడాదిలో కచ్చితంగా డజన్ల  కొద్దీ తుఫాన్లు ఏపీని తాకుతూనే ఉంటాయి. అందులో కొన్ని భయంకరంగా మీదకు దూసుకువస్తాయి.

దీంతో ఏపీ లాంటి రాష్ట్రాలు మరింతగా ఇబ్బందులో పడిపోతూంటాయి. ఇదిలా ఉంటే 2014లో వచ్చిన హుదూద్ కి, 2018లో వచ్చిన తిత్లీకి తాజాగా వచ్చిన గులాబ్ కి తేడా ఏంటి అంటే తుఫాను అపుడూ ఇపుడూ దారుణమే. అయితే ప్రజల కష్టాలు కడగండ్లూ పాలకులు ఎంతమేరకు పట్టించుకున్నారు. 

ఎంత మేరకు పని జరిగింది అని వివరాలు తీసుకుంటే మాత్రం గులాబ్ ముప్పుని ఏపీ సర్కార్ బాగానే అంచనా వేసి రెస్క్యూ ఆపరేషన్ ని గట్టిగానే చేపట్టింది అని చెప్పాలి. ఉత్తరాంధ్రా జిల్లాలను వణికించిన గులాబ్ తుఫాన్ విషయంలో అధికారులు మొత్తానికి మొత్తం అప్రమత్తం చేశారు. 

సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఏపీలో మరోసారి తన సత్తా చాటింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ నష్టం పెద్దగా లేకుండా చర్యలు చేపట్టారు. ఇక ముఖ్యమంత్రి జగన్ మొత్తం మానిటరింగ్ చేశారు. గతంలో చంద్రబాబు చేసినట్లుగా హంగూ ఆర్భాటం లేదు, ఆయన అధికారులతోనే అంతా చేయించారు.

విశాఖలో మకాం వేసి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ మొత్తం పరిస్థితిని సమీక్షించుకుంటూ వెళ్ళారు. మొత్తానికి గులాబ్ తుఫాన్ ఒడిషా తీరాన్ని తాకుతుంది అనుకున్నా అది శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వద్దనే తీరాన్ని దాటి అతి పెద్ద నష్టానే మిగిల్చింది. 

కానీ ప్రభుత్వం మాత్రం తన వరకూ బాగానే రెస్క్యూ ఆపరేషన్ చేసింది. అది కూడా ఎక్కడా గొప్పలు చెప్పుకోకుండా చాల సైలెంట్ గానే పని సాగింది. ఇక నష్టాన్ని భరించి బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని అంటున్నారు.