తన 39వ పుట్టిన రోజును జరుపుకోవడానికి తన తాజా గర్ల్ ఫ్రెండ్ అలియా భట్ ను వెంటపెట్టుకుని జోధ్ పూర్ వెళ్లాడట బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్. ఈ జంట జెట్ ఫ్లైట్ లో జాయింటుగా అక్కడకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. జోధ్ పూర్ విమానాశ్రయం బట వీరి జంటగా మీడియాకు అగుపించారు. రేపు రణ్ బీర్ కపూర్ పుట్టిన రోజు నేపథ్యంలో.. వీరిద్దరూ అక్కడకు వెళ్లినట్టుగా తెలుస్తోంది.
రణ్ బీర్ 39వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. సగటు భారతీయ లెక్కల ప్రకారం చూస్తే.. 39 యేళ్ల వయసు వరకూ బ్రహ్మచారిగా ఉండటం అనేది విడ్డూరమైన విషయమే. పెళ్లి కాక ఎవరైనా ఈ వయసు వరకూ అలా మిగిలిపోతారేమో కానీ, ఎలిజబుల్ బ్యాచిలర్స్ ఆ వయసు వరకూ ఉండరు. అయితే సినిమా హీరోల లెక్కలో మాత్రం ఇదేం పెద్ద వయసు కాకపోవచ్చు!
40 యేళ్లకు దగ్గర పడుతున్నా తెరపై మాత్రం 20 యేళ్ల వయసు పాత్రల్లోనే కనిపిస్తారు కాబట్టి.. అదే తమ వయసు అని ఫిక్సవుతారు కాబోలు! ఇక రణ్ భీర్ పెళ్లి గురించి గతంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కత్రినాతో పెళ్లి అయిపోయిందనేంత స్థాయిలో ప్రచారం జరిగింది. రణ్ భీర్ తండ్రి కూడా ఇతడిని పెళ్లి కొడుకు గెటప్ లో చూడాలని కలలు గన్నారట. పెషవరీ స్టైల్లో తన తనయుడిని పెళ్లి కొడుకుగా ముస్తాబు చేయాలనుకున్న కల తీరకుండానే రణ్ బీర్ తండ్రి కాలం చేశారు.
39 యేళ్ల వయసు వరకూ పెళ్లి కాకుండా ఎలా ఉంటారనుకోవచ్చు. అయితే ఆ వయసులో కూడా పుట్టిన రోజును గర్ల్ ఫ్రెండ్ తో జరుపుకునే అవకాశం ఉంటే.. బహుశా పెళ్లి ఆలోచన వాయిదా పడటానికి ఇక పెద్ద రీజన్ అక్కర్లేదేమో!