ఉక్కు వెనక భారీ కుట్ర?

విశాఖ విభజన ఏపీలోనే ఏకైక మహానగరం. ఏపీ సర్కార్ దాన్ని పాలనా రాజధానిగా కూడా ప్రతిపాదించింది. ఇక విశాఖ ఆసియాలోనే వేగంగా ఎదుగుతున్న సిటీ. ఈ నేపధ్యంలో విశాఖకే కాదు మొత్తం ఏపీకే తలమానికంగా…

విశాఖ విభజన ఏపీలోనే ఏకైక మహానగరం. ఏపీ సర్కార్ దాన్ని పాలనా రాజధానిగా కూడా ప్రతిపాదించింది. ఇక విశాఖ ఆసియాలోనే వేగంగా ఎదుగుతున్న సిటీ. ఈ నేపధ్యంలో విశాఖకే కాదు మొత్తం ఏపీకే తలమానికంగా స్టీల్ ప్లాంట్ ఉంది అన్నది తెలిసిందే.

విశాఖకు మరో పేరే ఉక్కు నగరం. అలా సిటీతో ఎంతగానో అనుబంధం పెనవేసుకుపోయిన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరిస్తామని కేంద్రం కుండబద్ధలు కొట్టింది. ఎందుకిలా హఠాత్తుగా కేంద్రం నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ ప్రైవేట్ పరం చేసి లాభాల బాట పట్టిస్తామని చెబుతోంది.

విశాఖ ఉక్కు ఆ మధ్య దాకా లాభాల్లోనే ఉంటూ వచ్చింది. గత ఏడాది కరోనాతో ప్రపంచం మొత్తం నష్టాల్లోకి వెళ్లిపోయింది. అందువల్ల ఒక్క ఉక్కునే అనడం భావ్యం కాదు. మరో వైపు చూస్తే సొంత గనులు విశాఖ ఉక్కుకు లేవు. అవి కనుక ఇచ్చి చూసి ఆ తరువాత కూడా నష్టాలలో ఉంటే అపుడు ఆలోచించాలి. కానీ ఇవేమీ చేయకుండా ఉక్కు నష్టపడిన కర్మాగారం. అంతే దాన్ని మేము అమ్మేస్తామని కేంద్రం దూకుడు చేస్తోంది.

అది కూడా ఉక్కు కర్మాగారం అసలైన విలువకు ఆరు రెట్లు తక్కువకు తెగనమ్మాలని చూడడం. ఇంతటి ఘనమైన విశాఖ ఉక్కుకు కేంద్రం కట్టిన విలువ ఎంతో తెలుసా. కేవలం 32 వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఉక్కు కర్మాగారానికి ఉన్న భూములు ఇరవై వేల ఎకరాలు. మెగా సిటీ విశాఖలో  ఆ భూముల విలువ ఇప్పుడున్న ధరల ప్రకరాం అక్షరాలా రెండు లక్షల కోట్లు. 

దాంతో పాటు ఇతర స్థిర చరాస్తులు కూడా ఉన్నాయి. అంటే కేవలం 32 వేల కోట్లకు ఉక్కుని తెగనమ్మితే  కొనుక్కున్న వారికి వచ్చేది అక్ష‌రాల లక్షా 68 వేల కోట్ల తక్షణ లాభం. కాలంతో పాటే ఉక్కు భూముల ధరలు పెరిగితే ఎన్ని లక్షల కోట్లో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.

మరి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడం అంటారా. అమ్మడం అంటారా. తెగ నమ్మడం అంటారా. మొత్తానికి చూస్తే దీని వెనక ఏదో భారీ కుట్ర ఉందని ఉక్కు కార్మిక సంఘాలు ఆందోళనకారులు అంటున్నారు అంటే ఆలోచించాల్సిందే.  కొన్న వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఇదంతా అంటున్న వారూ ఉన్నారు. ఉక్కు వెనక ఉన్న తుక్కు ప్లాన్లు ఇవే అయితే మాత్రం విశాఖ భగ్గుమనడం ఖాయం.

మద్రాసులో పుట్టగొడుగులు పండించి మొత్తం నష్టపోయా.

ప్రభాస్ కు పెద్ద ఫ్యాన్