మాకు యాక్టింగ్ రాదు…చేతులెత్తేసిన మంత్రులు!

నటుడు కావడం చాలా కష్టం. అది వెండి తెర మీద అయితే చెప్పేందుకు కనీసం దర్శకుడు, రచయిత ఉంటారు. నిజ జీవితంలో నటించడం అంటే అది పుట్టుకతోనే వచ్చి ఉండాలి. అందుకే వైసీపీ మంత్రులు…

నటుడు కావడం చాలా కష్టం. అది వెండి తెర మీద అయితే చెప్పేందుకు కనీసం దర్శకుడు, రచయిత ఉంటారు. నిజ జీవితంలో నటించడం అంటే అది పుట్టుకతోనే వచ్చి ఉండాలి. అందుకే వైసీపీ మంత్రులు ముందుగానే చేతులెత్తేస్తున్నారు

మాకు నటన అసలు రాదు, చంద్రబాబులా మీడియా ముందుకొచ్చి వీర లెవెల్లో నటించలేమని అంటున్నారు. అదే చంద్రబాబు అయితే అందులో పండిపోయారని మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్ సెటైర్లు వేస్తున్నారు.

హుదూద్ తుఫాన్ని ఒక్క చేత్తో  ఆపానని బాబు పండిపోయిన నటన ప్రదర్శించారని, తాము అలా చేయలేమని ఒప్పేసుకుంటున్నారు. తమ నాయకుడు జగన్ రోజుకు రెండు సార్లు కరోనా వైరస్ మీద సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారని, కానీ ఎక్కడా ప్రచారం కోసం పాకులాడడం లేదని మంత్రులు అంటున్నారు.

పని మాత్రమే మాట్లాడాలని, మనం కాదన్నది జగన్ నమ్ముతారని, తాము కూడా అదే చేస్తున్నామని, తాము కరోనా వైరస్  నియంత్రణకు  ఏం చేస్తున్నామో జనమంతా చూస్తున్నారని, టీడీపీ తమ్ముళ్ళూ,  చంద్రబాబు రాజకీయా లబ్ది  కోసం నిందలు వేస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చేతనైతే సాయం చేయండి, లేని పోని భయాలు, సందేహాలతో జనాలను చంపకండి అంటూ ఇద్దరు మంత్రులూ పచ్చ తమ్ముళ్ళకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. అయినా మారుతారా ఏంటి. అక్కడున్నవి మీడియా బేబీలు మరి.

21 రోజులు మొత్తం దేశమంతా లాక్ డౌన్

ఆర్మీని తెచ్చి.. షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇస్తాం