శునకం అయితేనేమి… జన్మ ధన్యం…

అవును ఎవరినైనా తేలిక చేయాలన్నా ఘాటుగా తిట్టాలన్నా కుక్క అనేస్తూంటారు. కానీ కుక్కలు విశ్వాసానికి మారు పేరు. అంతే కాదు, అవి దొంగలకు అసలైన శతృవులు, పగవాడి కుట్రలను పసిగట్టి గుట్టు మట్టు తీయడంలో…

అవును ఎవరినైనా తేలిక చేయాలన్నా ఘాటుగా తిట్టాలన్నా కుక్క అనేస్తూంటారు. కానీ కుక్కలు విశ్వాసానికి మారు పేరు. అంతే కాదు, అవి దొంగలకు అసలైన శతృవులు, పగవాడి కుట్రలను పసిగట్టి గుట్టు మట్టు తీయడంలో వాటి సాటి ఎవరూ లేరు.

ఇక పోలీస్ జాగిలాలు చేసే దర్యాప్తు ద్వారా ఎన్నో కీలకమైన కేసులను ఛేదించి దుర్మార్గుల అంతు చూసిన ఘటనకు ఉన్నాయి. అలాంటి ఒక పోలీస్ జాగిలం విశాఖలో మరణించింది. దాని పేరు రూబీ. ఇది పదేళ్ల పాటు విశాఖ పోలీస్ శాఖలో విశేష సేవలు అందించింది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ విభాగంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించింది. అనారోగ్య కారణాలతో రూబీ మరణిస్తే దానికి అధికార లాంచనాలతో పోలీసులు అంత్యక్రియలు జరిపించారు.

అంతే కాదు రూబీ పోలీస్ శాఖకు చేసిన సేవలు, దానితో ఉన్న అనుబంధాన్ని తలచుకుని కన్నీరు మున్నీరు అయ్యారు. ముఖ్యమంత్రులు, ప్రధానులు, వీవీఐపీలు విశాఖ వచ్చినపుడు ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చేసే ముందస్తు తనిఖీలలో రూబీ నిర్వహించిన పాత్ర అమోఘమని విశాఖ జిల్లా పోలీసులు చెబుతున్నారు.

ఇక రూబీ తెలివితేటలు కూడా  గొప్పవని ట్రైనింగ్ తీసుకున్న రోజులలోనే అది తన దూకుడు చూపేదని కూడా విశాఖ పోలీసులు అంటున్నారు. లాబ్రాడర్ రీట్రైవర్ జాతికి చెందిన రూబీ 2012 నుంచి విశాఖ పోలీస్ శాఖలో సేవలు అందిస్తోంది. ఏది ఏమైనా రూబీ జంతువుగా పుడితే పుట్టొచ్చు కాక చాలా మంది మనుషుల కంటే నయం. తన జన్మను ధన్యం చేసుకుంది.